టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నపూర్ణ స్టూడియోస్‌లో సందడి చేశారు. రెండో టెస్టు కోసం విరాట్ కోహ్లీ తన సతీమణి, బాలీవుడ్ నటి అనుష్క శర్మతో కలిసి హైదరాబాద్ వచ్చారు. ఈ నేపథ్యంలో కోహ్లీ అన్నపూర్ణ స్టూడియోస్ కు వెళ్లారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో విరాట్ కోహ్లీపై ఓ ప్రకటనను చిత్రీకరించనున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ, అక్కినేని అఖిల్ తో కలిసి సరదాగా ముచ్చటిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక శుక్రవారం నుంచి ఇండియా- వెస్ట్ ఇండీస్ మధ్య రెండో టెస్టు ఉప్పల్ స్టేడియంలో మొదలుకానుంది.
ఇక విరాట్ కోహ్లీ భార్య అనుష్క సుయీ ధాగా సినిమాతో భారీ సక్సెస్ ను అందుకున్నారు. ప్రస్తుతం అనుష్కకు సినిమా షూటింగులు ఏమీ లేకపోవడంతో భర్త విరాట్ తో కలిసి మ్యాచ్‌ను చూసేందుకు హైదరాబాద్‌కు వచ్చింది. అనుష్క శర్మ నటించిన జీరో చిసినిమా నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. షారుక్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో అందాల భామ కత్రినా కైఫ్ మరో కథానాయికగా నటించింది.