ఫోర్బ్స్ జాబితాలో పీవీ సింధు..

news02 Aug. 22, 2018, 3:48 p.m. sports

sindhu

స్పోర్ట్స్ డెస్క్ (ఇంటర్నేషనల్ కమ్యునికేషన్)- తెలుగు తేజం.. భారత స్టార్ బ్యాడ్మింటన్ పీవీ సింధు ప్రపంచ ప్రఖ్యాత ఫోర్బ్స్ మ్యాగజైన్ లో చోటు దక్కించుకుంది. ప్రపంచంలో అత్యధికంగా సంపాదిస్తున్న క్రీడాకారిణిల జాబితాను ప్రకటించింది ఫోర్బ్స్ మ్యాగజైన్. ఈ జాబితాలో పీవీ సింధు ఏడో స్థానాన్ని దక్కించుకుంది. మనం దేశంలో నుంచి ఫోర్బ్స్ జాబితాలో టాప్ 10లో కేవలం పీవి సింధు మాత్రమే ఉండటం విశేషం.

అంతర్జాతీయ వేధికలపై టోర్నీలు ఆడటంతో పాటు.. పలు వాణిజ్య ప్రకటనల్లో నటిస్తున్న పీవీ సింధు సంపాదనలో ఫోర్బ్స్ జాబితాలో ఏడో స్థానాన్ని దక్కించుకుంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా టాప్ 10లో ఉన్న క్రీడాకారణిల వివరాలు..

sindhu


టాప్ 10 క్రీడాకారిణిలు.. సంపాదన అమెరికా డాలర్లలో..
1- సెరెనా విలియమ్స్‌ - టెన్నిస్‌ - 18.1 మిలియన్ డాలర్లు

2- కరోలిన్‌ వొజ్నొకి- టెన్నిస్‌ - 13 మిలియన్ డాలర్లు

3- స్లోనే స్టీఫెన్స్‌ - టెన్నిస్‌ - 11.2 మిలియన్ డాలర్లు

4- గార్బిన్‌ ముగురుజ - టెన్నిస్‌ - 11 మిలియన్ డాలర్లు

5- మరియా షరపోవా - టెన్నిస్‌ - 10.5 మిలియన్ డాలర్లు

6- వీనస్‌ విలియర్స్‌ - టెన్నిస్‌ - 10.2 మిలియన్ డాలర్లు

7- పీవీ సింధు - బ్యాడ్మింటన్‌ - 8.5 మిలియన్ డాలర్లు

8- సిమోనా హలెప్‌ - టెన్నిస్‌ - 7.7 మిలియన్ డాలర్లు

9- డానిక పాట్రిక్‌ - రేస్‌ కార్‌ డ్రైవర్‌ - 7.5 మిలియన్ డాలర్లు

10- కెర్బర్‌ - టెన్నిస్‌ - 7 మిలియన్ డాలర్లు

మొత్తానికి మన తెలుగు తేజం సంపాదనలో ఫోర్బ్స్ జాబితాలో స్థానం సంపాదించడం మనకూ గర్వకారణమే కదా.

tags: sindhu, pv sindhu, sindhu in forbes, pv sindhu in forbes list, sindhu name in forbes, pv sindhu income

Related Post