బాధ్య‌త‌లు స‌రిగా నిర్వ‌హిస్తే ఆయ‌నే ప‌ర్మినెంట్‌

news02 July 16, 2018, 5:51 p.m. sports

team india mahila team

ముంబాయి: గ‌త కొద్ది రోజులు టీం ఇండియా మ‌హిళ జ‌ట్టుకు కోచ్ లేకుండానే ఆట‌గాళ్లు మ్యాచ్‌ల్లో పాల్గొంటున్న విష‌యం తెలిసిందే. కోచ్ ప‌ద‌వికి తుషార్ ఆథోర్ రాజీనామా చేసిన నుంచి ఇదే ప‌రిస్థితి కొన‌సాగుతుంది. దీంతో మ‌హిళ జ‌ట్టు అప్ప‌టి నుంచి స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోంటుంది. ప్లేయ‌ర్స్ అంతర్జాతీయ సిరీస్‌ల్లో పాల్గొనేట‌ప్పుడు...కీల‌క సూచ‌న‌లు చేసే గురువు లేక స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. 

ramesh povar

అయితే ఈనేప‌థ్యంలోనే బీసీసీఐ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. మ‌హిళ జ‌ట్టుకు కోచ్‌గా మాజీ క్రికెటర్‌ను నియ‌మించింది. రమేశ్ పొవార్‌ను మ‌హిళ జ‌ట్టు ఇంటెర్మ్ కోచ్‌గా అపాయింట్ చేసింది. ఆయ‌న ఈప‌ద‌విలో జూలై 25 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకూ కొన‌సాగ‌నున్నారు. అలాగే ర‌మేష్ పొవార్ కోచ్‌గా రాణిస్తే బీసీసీఐ ఆయ‌న‌నే కొన‌సాగించ‌వ‌చ్చ‌నే వార్త‌లు కూడా వినిపిస్తున్నాయి. 

tema india

ఇక టీం ఇండియా మ‌హిళ జ‌ట్టుకు కోచ్‌గా ఎంపికైన ర‌మేశ్ పొవార్ చాలా కాలంగా క్రికెట్‌కు దూరంగానే ఉంటూ వ‌స్తున్నారు. ఈనేప‌థ్యంలోనే ఆయ‌న‌ను బీసీసీఐ పిలిచి మ‌హిళ జ‌ట్టు కోచ్‌గా అప్ప‌గించ‌డంతో...ఖాళీగా ఉన్న ఆయ‌న‌కు మంచి అవ‌కాశం వ‌చ్చిన‌ట్లైందని చెబుతున్నారు క్రికెట్ విశ్లేష‌కులు. 

tags: team india mahila team coach povar,

Related Post