డేటింగ్ లో సైనా-కశ్యప్

news02 May 29, 2018, 10:30 a.m. sports

saina nehwal

హైదరాబాద్(స్పోర్ట్స్ డెస్క్)- ప్రముఖ స్టార్‌ షట్లర్లు సైనా నెహ్వాల్‌, పారుపల్లి కశ్యప్‌ లను పెళ్లి చెసుకోమని కోరుతున్నారు వారి అభిమానులు. అదేంటీ వాల్లిద్దరిని ఫ్యాన్స్ ఎందుకు పెళ్లి చేసుకోమంటున్నారని ఆశ్చర్యపోతున్నారా.. చాలా కాలంగా సైనా నెహ్వాల్- కశ్యప్ లు డేటింగ్‌లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఐతే దీనిపై వాళ్లిద్దరు ఏ మాత్రం స్పిందించలేదు. ఐతే ఇందుకు అనుగునంగానే ఈ మధ్య హైదరాబాద్‌ లోని ఓ రెస్టారెంట్లో కశ్య్‌ప తో కలిసి దిగిన ఫొటోను సైనా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయడం ఆసక్తికరంగా మారింది.

saina kashyap

ఇంకేముంది సైనా-కశ్యప్ ల ఫొటో వైరల్‌గా మారడంతో వీరిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అందుకే మీరిద్దరు పెళ్లిటేసుకొండి ప్లీజ్ అంటూ సైనా-కశ్యప్ లను అభిమానులు బతిమాలుతున్నారు. ఇద్దరిదీ పర్‌ఫెక్ట్‌ జోడీ.. అని ఒకరు, చూడ్డానికి చక్కగా ఉన్నారు.. డేటింగ్‌ వార్తలను నిజం చేయండి.. ప్లీజ్‌ అంటూ మరొకరు.. ఇప్పటికే బ్యాడ్మింటన్‌లో చాలామంది జంటలుగా మారారు, మీరూ వాళ్లను అనుసరించండి’ అంటూ ఇంకొకరు సోషల్ మీడియా ద్వార విన్నవించుకుంటున్నారు. మరి అభిమానుల కోరికమేరకు సైనా నెహ్వాల్.. కశ్యప్ లు జంటగా మారుతరా అన్నదే సస్పెన్స్.

tags: saina nehwal, saina, saina dating with kashyap, saina with kashyap

Related Post