అభిమానానికి హద్దులుండవు

news02 July 3, 2019, 8:51 p.m. sports

virat

సాధారనంగా క్రికెట్‌ మ్యాచ్ ఆడేటప్పుడు కెమెరాలు, ప్రేక్షకుల కళ్లు ఆటగాళ్లపైనే కేంద్రీకృతమై ఉంటాయి. ఇక ఆ రోజు ఆ మ్యాచ్‌కు ఎవరైనా సెలబ్రిటీలు వస్తే మాత్రం అటువైపు కూడా అందరి దృష్టి ఉంటుంది. ప్రధానంగా ఆటగాళ్ల భార్యలు, సినీ ప్రముఖులు వచ్చినప్పుడు కెమెరాలు అప్పుడప్పుడు వాళ్లవైపు తిరుగుతుంటాయి. ప్రపంచకప్‌లో భారత్‌ వర్సెస్ బంగ్లాదేశ్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కెమెరాలన్నీ ఓ వ్యక్తిని ప్రధానంగా హైలైట్‌ చేశాయి. అలా అని ఆమె వీఐపీ కాదు.. సెలబ్రిటీ అస్సలే కాదు. అయినా కూడా మ్యాచ్ చందర్బంగా ఒక్కసారిగా కెమెరాలన్నీ ఆమె తనవైపు తిప్పుకొన్నారు. ఎవరబ్బా ఆమె అనుకుంటున్నారా.. ఆమె పేరు చారులత.. వయసు 87 సంవత్సరాలు. ఇక క్రికెట్‌ అంటే ఆమెకు ఎనలేని అభిమానం.  మరింకేం భారత్‌ వర్సెస్ బంగ్లాదేశ్‌ మ్యాచ్‌ చూసేందుకు వచ్చి తెగ సందడి చేశారు. టీమిండియా బ్యాటింగ్‌ చేస్తుండగా, అందులోను రాహుల్‌-రోహిత్‌లు బౌండరీలు కొడుతుంటే ఈ భామ్మ బూర ఊదుతూ సందడి చేసింది. ఇక ఈ బామ్మపై టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ ప్రశంసలు జల్లు కురిపించాడు. మ్యాచ్‌ గెలుపు సందర్భంగా అభిమానులందరూ తమ ప్రేమను, మద్దతును చూపినందుకు ధన్యవాదాలు తెలపాలనుకుంటున్నానని... ముఖ్యంగా చారులతాజీ కి ధన్యవాదాలు అని ట్వీట్ చేశారు విరాట్. తాను చూసిన వారిలో క్రికెట్‌ అంటే అంత అభిరుచి ఉన్న అభిమాని ఈమే అని చెప్పారు. వయసు అనేది కేవలం సంఖ్య మాత్రమేనని.. అభిమానానికి హద్దులుండవని కోహ్లీ చెప్పుకొచ్చారు. ఆమె ఆశీర్వాదంతో మరో మ్యాచ్‌కు ముందుకెళతామని టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ట్వీట్‌ ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఇక ఈ బామ్మ ఫొటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. 

 

tags: virat, virat kohli, virat meet old lady fan, virat kohli meet old lady fan, virat meet woman fan, virat kohli meet old woman fan

Related Post