సింధు అరుదైన రికార్డ్..

news02 Aug. 28, 2018, 2:30 p.m. sports

pv

జకర్తా (స్పోర్ట్స్ డెస్క్)- తెలుగు తేజం.. భారత బ్యాడ్మింటన్ పీవీ సింధు 18వ ఆసియా క్రీడల్లో రజతంతో సరిపెట్టుకుంది. ఇండోనేషియాలో జరుగుతున్న 18వ ఆసియా క్రీడల్లో ఫైనల్ కు చేరిన సింధు... ఈ రోజు ప్రపంచ నంబర్ వన్ బ్యాడ్మింటన్ తైజూ యింగ్ తో పాటీ పడి ఓటమిపాలయ్యింది. ఫైనల్లో సింధు తైజూకు ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. మ్యాచ్ ప్రారంభం నుంచి సింధు వెనుకబడి పోయింది. మొదటి గేమ్ లో 13-21తో, రెండో గేమ్ లో 16-21తో సెట్ ను కోల్పోయింది. ఇక పలు మ్యాచుల్లో ఇప్పటివరకు సింధు, తైజూ 13 సార్లు పోటీ పడగా 10సార్లు తైజూ మ్యాచ్ ను గెలిచింది. ఐతే ఆసియా క్రీడల చరిత్రలో బ్యాడ్మింటన్ సింగిల్స్ లో రజతం సాధించిన మొట్టమొదటి క్రీడాకారిణిగా పీవీ సింధు రికార్డ్ నెలకొల్పింది.

pv

tags: pv sindhu, sindhu, pv sindhu in asia games, pv sindhi with silver medal, pv sindhu gold medal in 18th asia games, pv sindhu wil silver medal in asia games

Related Post