18 పరుగుల తేడాతో ఓడిన భారత్

news02 July 11, 2019, 6:39 a.m. sports

team india

ప్రపంచ కప్ లో టీం ఇండియా నిరాశే మిగిల్చింది. వరల్డ్ కప్ ఫైనల్‌లోకి న్యూజిలాండ్ దూసుకెళ్లింది. విజయానికి 18 పరుగుల ముందు భారత ఇన్నింగ్స్ ముగిసింది. విజయంపై ఆశలు రేకెత్తించిన జడేజా 77 పరుగుల దగ్గర అవుటయ్యాక టీం ఇండియా ఆశలు ఆవిరయ్యాయి. సిక్సర్‌తో ఎంఎస్ ధోనీ ఆశలు రేపినప్పటికీ ఆ వెంటనే రనౌట్ అవడం కివీస్‌కు కలిసొచ్చింది. ఆ తర్వాత మిగిలిన రెండు వికెట్లను తీయడానికి కివీస్ పెద్దగా కష్టపడాల్సిన పని లేకుండాపోయింది. చాహల్ అవుట్‌తో ప్రపంచకప్‌లో భారత ప్రస్థానం ముగిసింది. ఎట్టకేలకు న్యూజిలాండ్ రెండోసారి ప్రపంచకప్ ఫైనల్‌లో అడుగుపెట్టింది.
 world cup 2019
వర్షం కారణంగా చివర్లో ఆగిపోయిన మ్యాచ్.. మరుసటి రోజు 211/5తో ఇన్నింగ్స్ కొనసాగించిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. విలియమ్సన్ 67, రాస్ టేలర్ 74 పరుగులు చేశారు. అనంతరం 240 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన టీం ఇండియా మొదటి బంతి నుంచే కష్టాల్లో పడింది. టాప్-3 బ్యాట్స్‌మెన్ అయిన రాహుల్, రోహిత్, కోహ్లీలు ఒక్కో పరుగు మాత్రమే చేసి అవుటవడం భారత్‌కు ప్రతికూలంగా మారింది. 24 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోవడంతో తర్వాతి బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి బాగా పెరిగిపోయింది. ఆ తరువాత ఎంఎస్ ధోనీ (50), జడేజా(77)లు భారత శిబిరంలో ఆశలు రేపినప్పటికీ వారిద్దరూ అవుటయ్యాక 221 పరుగులకే భారత్ కుప్పకూలి పోయింది. ఇంకేముంది టీం ఇండియా పరాజయం పాలైంది. 18 పరుగుల తేడాతో గెలిచిన న్యూజిలాండ్‌ ఫైనల్‌కు చేరుకుంది. 

tags: world cup, world cup 2019, team india, team india loss world cup, team india loss semi finals

Related Post