ఆట‌గాళ్ల‌ను వినూత్న ప‌ద్ధ‌తిలో గౌర‌వించుకున్న ఫ్రాన్స్‌

news02 July 17, 2018, 5:33 p.m. sports

soccer

ప్యారిస్: మామూలుగా అంత‌ర్జాతీయ క్రీడ‌ల్లో స‌త్తా చాటిన ఆట‌గాళ్ల‌కు స‌ద‌రు దేశాలు స‌న్మానాలు చేయ‌డం, పుర‌స్కారాలు అందించి గౌర‌వించుకోవ‌డం ఆన‌వాయితీ. ఇంకా చెప్పాలంటే ప్ర‌భుత్వంలో కీల‌క‌మైన ప‌ద‌వులు కూడా ఇవ్వ‌డం ప‌రిపాటి. అదీ కాదంటే భూములు, న‌గ‌దు రూపంలో ప్రైజ్ మ‌నీని గిఫ్ట్‌గా ఇవ్వ‌డం తెలిసిందే. అయితే ఇది ఏ ఒల‌పింక్స్‌లోనో ...లేక..అంత‌ర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన క్రీడ‌ల్లో చాంపియ‌న్‌లుగా గెలుపొందిన వారికి ఇలాంటీ బంఫ‌ర్ ఆఫ‌ర్లు ఇవ్వ‌డం చూశాం. 

fifa

కానీ, సాక‌ర్ వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఫ్రాన్స్‌ను విశ్వ‌విజేత‌గా నిలిపిన ఆదేశ జ‌ట్టు ఆట‌గాళ్ల‌కు ఇది చాల‌దు అనుకున్న‌ట్లుంది ఫ్రెంచ్ స‌ర్కారు. అందుకే ఫిపా వ‌ర‌ల్డ్ క‌ప్‌ను అందించిన క్రీడాకారుల‌ను ఫ్రాన్స్ ప్ర‌జ‌లు ఎప్ప‌టికీ మ‌ర‌చిపోకుండా ఉండేందుకు అద్భుత‌మైన నిర్ణ‌యం తీసుకుంది.  సాక‌ర్ వ‌ర‌ల్డ్ క‌ప్‌లో పాల్గొన్న జ‌ట్టు స‌భ్యుల మ‌ధుర‌స్మృతులు ఎప్ప‌టికీ ఉండేలా...దేశ రాజ‌ధాని ప్యారిస్‌లోని 6 మెట్రో స్టేషన్ల పేర్ల‌ను మార్చి క్రీడాకారుల‌కు అరుదైన గౌర‌వం క‌ల్పించింది. 

fifa

జట్టును విజయ పథంలో నడిపించిన సారథి, గోల్‌కీపర్‌ లారిస్‌ పేరును ఒక మెట్రోస్టేషన్‌కు పెట్టారు. విక్టర్‌ హ్యూగో స్టేషన్‌ పేరును విక్టర్‌ హ్యూగో లారిస్‌గా నామ‌క‌ర‌ణం చేశారు. ప్రాన్స్ జ‌ట్టుకు మ‌రో పేరైనా లెస్ బ్లూస్ పేరు వ‌చ్చేలా బెర్సీ మెట్రో స్టాప్‌న‌కు బెర్సీ లెస్‌ బ్లూస్ అనే పేరు పెట్టారు. ఇక అవ్‌రాన్‌ స్టేషన్‌కు నౌస్‌ అవ్‌రాన్‌ గాగ్నె అని.. చార్లెస్‌ డి గాలె-ఎటోయిలీని ఆన్‌ ఏ 2 ఎటోయిలీస్ గా నేమ్స్ చేంజ్ చేసేశారు. నోట్రి డామె డెస్‌ ఛాంప్స్‌ పేరు నోట్రి డిడిర్‌ డెస్‌ఛాంప్స్‌గా ...ఛాంప్స్‌ ఎలిసీస్‌ క్లెమెన్సియాను డెస్‌ఛాంప్స్‌ ఎలిసీస్‌ క్లెమెన్సియాగా పేర్లను స‌వ‌రించారు. 

fifa

అయితే 1998లో సాక‌ర్ వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచిన ఫ్రాన్స్...అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఫిఫా క‌ప్‌ను గెలువ‌లేక‌పోయింది. ఇక తాజాగా సాక‌ర్ క‌ప్ త‌మ దేశం సొంతం కావ‌డంతో...ఇప్పుడు ఫ్రాన్స్ ప్ర‌జ‌ల‌కు ఎక్క‌డ లేని ఆనందం క‌లిగించింది. ఈనేప‌థ్యంలో దేశానికి అంత‌టి కీర్తి తెచ్చిపెట్టిన దానికి గుర్తుగానే ఫ్రెంచ్ ప్ర‌భుత్వం ఈకీల‌క నిర్ణ‌యం తీసుకోవ‌డం విశేషం. 
 

tags: france chage to their metro stations names,fifa world cup-2018,fifa world cup 2018 winner,fifa world cup 2018 winner prize,fifa world cup 2018 winner list,fifa world cup 2018 winner team fifa world cup 2018 winner prediction,fifa world cup 2018 winner prize money,fifa world cup 2018 winner odds,fifa world cup 2018 winner prize money in rupees,fifa world cup 2018 winner team prize money,fifa world cup 2018 winner team list,fifa world cup 2018 winner amount,fifa world cup 2018 winner astrology predictions,fifa world cup 2018 winner astrology,fifa world cup 2018 winner award,fifa world cup 2018 winner predictions,fifa world cup 2018 winner bet,fifa world cup 2018 winner chances,fifa world cup 2018 winner country,fifa world cup 2018 winner chart,fifa world cup 2018 winner cat rediction,fifa world cup 2018 winner expectation,fifa world cup 2018 winner forecast,fifa world cup 2018 winner history fifa world cup 2018 winner list match date,fifa world cup 2018 winner match schedule,fifa world c

Related Post