తనదైన శైళిని ప్రదర్శించిన పుజారా

news02 Dec. 6, 2018, 9:34 p.m. sports

pujara

టీమిండియా-ఆస్ట్రేలియా టెస్టు సమరం ప్రారంభమైంది. తొలి రోజు ఆటలో కోహ్లీసేన కాస్త తడబడింది. ఆట మొదలైన వెంటనే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. పుజారా ఒంటరి పోరాటంతో భారత్‌ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 250/9 వద్ద నిలిచింది. అడిలైడ్‌ వేదికగా ప్రారంభమైన తొలి టెస్టులో టాస్‌ గెలిచిన భారత్‌.. బ్యాటింగ్ ఎంచుకుని బరిలోకి దిగింది. పిచ్‌ పై పచ్చిక ఉండటంతో ముందుగా బ్యాటింగ్‌ చేయడానికి కోహ్లీసేన మొగ్గు చూపింది. అయితే బ్యాటింగ్‌ కు దిగిన కాసేపటికే ఓపెనర్లు వికెట్లు కోల్పోయారు. ఓపెనర్‌ రాహుల్‌ (2, 8బంతుల్లో) హేజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో డ్రైవ్‌కు ప్రయత్నించి స్లిప్‌లో ఫించ్‌ చేతికి చిక్కి అవుటయ్యాడు. ఆ తరువాత స్టార్క్‌ బౌలింగ్‌లో మరో ఓపెనర్‌ మురళీ విజయ్‌(11, 22బంతుల్లో 1×4) కీపర్‌ ఫైన్‌కి క్యాచ్‌ ఇచ్చి ఓటమిపలయ్యాడు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ (16బంతుల్లో 3పరుగులు) సైతం అవుటవ్వడానికి ఎంతో సమయం పట్టలేదు. కమిన్స్‌ బౌలింగ్‌లో ఆఫ్‌ సైడ్‌ బంతిని డ్రైవ్‌ చేయడానికి ప్రయత్నించగా.. ఉస్మాన్‌ ఖవాజా కళ్లు చెదిరే క్యాచ్‌ పట్టాడు. అప్పటికి భారత్ 19/3 స్కోర్‌తో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇక పుజారా.. వికెట్లు పడుతున్నా తనదైన శైలిలో ఒంటరిపోరాటం చేశాడు. 

tags: pujara, australia vs india, australia vs india test , australia vs india test match, pujara century in test matc

Related Post