పాకిస్థాన్ ఇక ఇంటిబాట పట్టాల్సిందే

news02 July 4, 2019, 8:35 a.m. sports

pakistan

ప్రపంచ కప్ నుంచి దాయాది దేశం పాకిస్థాన్ దాదాపు వైదొలిగినట్టేనని చెప్పవచ్చు. న్యూజిలాండ్‌ తన చివరి లీగ్‌ మ్యాచ్‌లో ఓడినా.. సెమీ ఫైనల్‌ చేరడం దాదాపుగా ఖరారేనని తెలుస్తోంది. ఇందులో భాగంగా వరల్డ్ కప్ మ్యాచ్ నుంచి పాకిస్థాన్‌ నిష్క్రమణ కూడా ఖాయమేనని వేరే చెప్పక్కర్లేదు. అదెలాగంటే.. అన్ని మ్యాచ్‌లూ ఆడేసిన కివీస్‌ ఇప్పుడు 11 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా (14), భారత్‌ (13), ఇంగ్లాండ్‌ (12) తర్వాత 11 పాయింట్లతో ఫోర్త్ ప్లేస్ లో ఉంది. ఆ జట్టు నెట్‌  రన్‌ రేట్‌ 0.175 గా ఉంది. ఇక 9 పాయింట్లతో ఉన్న పాకిస్థాన్‌ నెట్‌ రన్‌రేట్‌ -0.792 గా ఉంది. తన చివరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై గెలిస్తే 11 పాయింట్లతో కివీస్‌ను సమం చేయగలుగుతుంది. కానీ పాకిస్థాన్‌.. రన్‌రేట్‌లో ఆ జట్టును దాటడం దాదాపు అసంభవమేనని చెప్పవచ్చు. అలా దాటాలంటే కనీసం 316 పరుగుల తేడాతో నెగ్గాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది ఆసాధ్యమనే చెప్పాలి. అందుకే పాకిస్థాన్ ప్రపంచ కప్ మ్యాచ్ నుంచి వైదొలిగినట్టేనని స్పష్టమవుతోంది.

tags: pakistan, pakistan team, pakistan cricket team, pakistan team may not reach semis in world cup, pakistan not reached world cup semis

Related Post