Kedarnath

విరిగిపడ్డ మంచు పలకలు

కేదార్‌నాథ్‌ లో అవలాంచ్ - వణికిపోయిన భక్తులు - వీడియో వైరల్

నేషల్ రిపోర్ట్- ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్‌ నాథ్‌ (Kedarnath) లో ప్రకృతి కాసేపు భక్తులను భయాందోళనకు గురిచేసింది. మంచుపర్వతాల్లోని అవలాంచ్‌ (Avalanche) అందరిని వణికించింది. ఉత్తరాఖండ్‌ (Uttarakhand) లోని కేదర్ నాధ్ ఆలయం సమీపంలోని ఎత్తైన మంచు పర్వత సానువుల నుంచి ఒక్కసారిగా మంచుఫలకాలు విరిగిపడ్డాయి. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆదివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకున్నట్లు జాతీయ మీడియా తెలిపింది. ఐతే అవలాంచ్ కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. సుమారు ఆరు నెలల విరామం తరువాత ఏప్రిల్‌ 25న కేదార్‌ నాథ్‌ ఆలయ ద్వారాలు తెరచుకున్నాయి. దీంతో కేదారేశ్వరుడిని దర్శించేందుకు వేల సంఖ్యలో భక్తులు కాలినడకన వెళ్తున్నారు. ఇటీవల ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు, వరదల కారణంగా చాలా సార్లు కేధర్ నాధ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. పరిస్థితి సద్దుమణగడంతో మళ్లీ కేధర్ నాధ్ యాత్ర మొదలైంది.


Comment As:

Comment (0)