Rahul Gandhi Congress

బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు – రాహూల్ గాంధీ

హైదరాబాద్ రిపోర్ట్- దేశంలో మరోసారి బీజేపీ గెలిస్తే రాజ్యాంగం రద్దు చేస్తారని ఏఐసీసీ అగ్రనేత రాహూల్ గాంధీ (Rahul Gandhi) హెచ్చరించారు. భారత రాజ్యాంగం కేవలం పుస్తకం కాదన్న ఆయన.. అది పేద ప్రజల చప్పుడని చెప్పారు. హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో జరిగిన లోక్ సభ ఎననికల ప్రచార సభ జనజాతరలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తో కలిసి పాల్గొన్నారు రాహూల్ గాంధీ. రిజర్వేషన్లు వచ్చింది మన రాజ్యాంగం వల్లేనని చెప్పిన రాహూల్.. ప్రజలకు అధికారం ఇచ్చింది రాజ్యాంగమేనని చెప్పుకొచ్చారు.

రాజ్యాంగం కోసం అంబేద్కర్, గాంధీ, నెహ్రూ లాంటి వాళ్ళు తమ చెమటను, రక్తాన్ని దారపోసారని రాహూల్ గాంధీ చెప్పారు. అదానీ, అంబానీ లాంటి 22 మంది కోసం మోదీ రాజ్యాంగాన్ని నడిపారని మండిపడ్డ ఆయన.. రాహుల్, రేవంత్ లాంటి వాళ్ళం రాజ్యాంగాన్ని కాపాదుకుంటామని అన్నారు. ప్రజలకు చెందిన లక్షల కోట్లను 22 మంది పెట్టుబడి దారులకు మోదీ పంచారని ఆరోపించారు. దేశంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేసిన రాహూల్ గాంధీ.. అధికారంలోకి రాగానే పేదల లిస్ట్ అంతా తయారు చేస్తామని చెప్పారు.

ప్రతి పేద ఇంటిలో ఒక మహిళకు సంవత్సరానికి లక్ష రూపాయలు ఇస్తామని రాహూల్ గాంధీ హామీ ఇచ్చారు. దేశంలో సంపదకు కొదవలేదన్న రాహూల్.. ఇన్ని రోజులు ప్రజల డబ్బులను మోదీ పెట్టుబడిదారులకు పంచారని, కానీ తాము పేదలకు పంచుతామమని అన్నారు. తప్పుడు నిర్ణయాలతో మోదీ దేశంలో నిరుద్యోగాన్ని పెంచారన్న రాహూల్.. విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాల కల్పన చేస్తామని భరోసా ఇచ్చారు.  మేనిఫెస్టోలో పెట్టిన అన్ని అంశాలను అమలు చేస్తామని చెప్పుకొచ్చారు.

 


Comment As:

Comment (0)