CM KCR Kamareddy

కామారెడ్డి నుంచి పోటీ చేయడం దైవకృపగా భావిస్తున్నా

కామారెడ్డితో పుట్టినప్పటి నుంచి అనుబంధం ఉంది- సీఎం కేసీఆర్

కామారెడ్డి రిపోర్ట్- బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) గజ్వేల్ (Gajwel), కామారెడ్డి (Kamareddy) నియోజకవర్గాల్లో నామినేషన్లు దాఖలు చేశారు. తాను పుట్టినప్పటి నుంచి కామారెడ్డి గడ్డతో ఎంతో అనుబంధం ఉందని ఈ సందర్బంగా అన్నాకు కేసీఆర్. కోనాపూర్‌ గా పిలుస్తున్న పోసానిపల్లిలో తన తల్లి జన్మించారని గుర్తుచేసుకున్నారు. నామినేషన్ దాఖలు చేసిన తరువాత కామారెడ్డిలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తొలి నాల్లలో కామారెడ్డికి చెందిన న్యాయవాదులు చైతన్యం చూపించారని ఈ సందర్బంగా కేసీఆర్ చెప్పారు.

ఎన్నో కష్టాలను ఎదుర్కొని తెలంగాణ సాధించుకున్నామని, కామారెడ్డి ని జిల్లాగా చేసుకున్నామని, మెడికల్‌ కాలేజీ కూడా ఏర్పాటు చేసుకున్నామని కేసీఆర్ చెప్పారు.  ఎమ్మెల్యే గోవర్ధన్ కామారెడ్డి నుంచి పోటీ చేయాలని తనను చాలా సార్లు అడిగారని కేసీఆర్ చెప్పారు. కామారెడ్డి నుంచి పోటీ చేయడం దైవకృపగా భావిస్తున్నానని చెప్పిన ఆయన.. కేసీఆర్ వస్తే ఒక్కడే రారు కదా.. కేసీఆర్‌ తో పాటు కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు నీరు అందిస్తామని అన్నారు. ఎన్నికలు వస్తాయి పోతాయి.. ప్రతి పార్టీ నుంచి ఒక అభ్యర్థి పోటీలో ఉంటాడు.. అభ్యర్థుల గుణంతో పాటు అతని వెనుక ఉన్న పార్టీ ఎలాంటిదనేది కూడా ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని చెప్పారు కేసీఆర్.


Comment As:

Comment (0)