Chandra Babu statement

ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట చంద్రబాబు

నన్ను పోలీసులు మానసికంగా వేధించారు - చంద్రబాబు

విజయవాడ రిపోర్ట్- తనను పోలీసులు మానసికంగా వేధించారని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) చెప్పారు. ఆదివారం ఉదయం 6 గంటల వరకు రోడ్లపై వాహనంలో తిప్పుతూనే ఉన్నారని ఏసీపీ కోర్టు (ACb Court) న్యాయమూర్తికి తెలిపారు. సీఐడీ కస్టడీలో పోలీసులు తనను ఇంటరాగేట్‌ చేస్తున్న దృశ్యాలను దురుద్దేశపూర్వకంగా మీడియాలో ప్రత్యక్ష ప్రసారం చేయించారని, ఆ అధికారం సీఐడీకి లేదని చెప్పారు చంద్రబాబు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏర్పాటుకు సంబంధించిన కేసులో చంద్రబాబును అరెస్ట్‌ చేసిన సీఐడీ పోలీసులు ఆదివారం ఉదయం విజయవాడలోని ఏసీపీ కోర్టులో హాజరుపరిచినప్పుడు జడ్జ్ హిమబిందు (Himabindu) ఎదుట ఆయన వాంగ్మూలమిచ్చారు. చంద్రబాబును ఈ నెల 22 వరకు రిమాండ్‌కు పంపుతూ ఏసీబీ కోర్టు న్యాయామూర్తి ఇచ్చిన ఉత్తర్వుల పూర్తి కాపీ సోమవారం బయటకు వచ్చింది. కోర్టులో చంద్రబాబు ఇచ్చిన స్టేట్మెంట్ వివరాలు అందులో ఉన్నాయి.

మిమ్మల్ని ఏ సమయంలో అరెస్ట్‌ చేశారన్న న్యాయామూర్తి ప్రశ్నకు.. నేను బస చేసిన ప్రదేశాన్ని శుక్రవారం రాత్రి 11 గంటల నుంచి పోలీసులు ముట్టడించారని చంద్రబాబు చెప్పారు. శనివారం తెల్లవారుజామున 5 నుంచి 5.30 గంటల ప్రాంతంలో సీఐడీ డీఐజీ రఘురామిరెడ్డి, కేసు దర్యాప్తు అధికారి ధనుంజయ్‌ నా దగ్గరకు వచ్చి పరిచయం చేసుకున్నారు. వారి రాకకు కారణమేమిటని అడిగితే.. అరెస్ట్‌ నోటీసు ఇచ్చారు. కేసు వివరాలు అడిగితే సమాధానం చెప్పలేదు.. అని చంద్రబాబు న్యాయమూర్తికి చెప్పారు. పోలీసులు మీతో దురుసుగా ప్రవర్తించారా.. అన్న ప్రశ్నకు.. శారీరకంగా ఇబ్బంది పెట్టలేదు గానీ, మానసికంగా వేధిస్తూనే ఉన్నారని చెప్పారు చంద్రబాబు. ఎలాంటి ప్రాథమిక సాక్ష్యాధారాలు లేకుండానే తనను అరెస్ట్‌ చేశారని న్యాయమూర్తికి విన్నవించారు


Comment As:

Comment (0)