సోషల్ మిడియాలో వైరల్ వీడియో

నన్ను చంపకండి.. ప్లీజ్ వదిలిపెట్టంద - హమాస్‌ మిలిటెంట్లను వేడుకున్న యువతి

ఇంటర్ నేషనల్ రిపోర్ట్- ఇజ్రాయెల్ లో భీకర పరిస్తితులు నెలకొన్నాయి. అక్కడ సామాన్య ప్రజలతో పాటు విదేశీయులు బిక్కు బిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య యుద్ధం(Israel-Hamas Conflict) రోజు రోజుకు తీవ్ర రూపం దాలుస్తోంది. తాజాగా ఇజ్రాయెల్‌లో ఓ కార్యక్రమంలో జరుగుతున్న ఓ డ్యాన్స్‌ పార్టీపై హమాస్‌ మిలిటెంట్లు జరిపిన దాడితో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది జీవితాలు అతలాకుతలం అయ్యాయి. ఒక్కసారిగా ఆకాశం నుంచి రాకెట్లు, మరోవైపు తూటాలతో మిలిటెంట్లు దాడులకు పాల్పడటంతో వందల సంఖ్యల్లో ప్రజలు మృతి చెందారు. ఈ దారుణమైన ఘటనకు సంబంధించిన ఫొటోలు, కొన్ని వీడియోలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పీస్‌ ఫెస్టివల్‌లో పాల్గొన్న అర్గమణి (Argamani) అనే 25 ఏళ్ల అమ్మాయిని హమాస్‌ మిలిటెంట్లు  కిడ్నాప్ చేసి బలవంతంగా బైక్‌పై తీసుకెళ్తుండగా..నన్ను చంపొద్దు ప్లీజ్ అంటూ ఆ యువతి భయంతో వేడుకోవడం కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ కావంతో వైరల్ అవుతోంది. ప్లీజ్‌..నన్ను చంపకండి.. దయచేసి వదిలిపెట్టండి.. అంటూ బైక్‌పై తీసుకెళ్తున్న సమయంలో అర్గమణి మిలిటెంట్లను వేడుకుంటోంది. ఆమె బాయ్‌ ఫ్రెండ్ నాథన్‌ ను కూడా హమాస్ దళాలు బంధించి తీసుకెళ్తున్నట్లు వీడియో చూస్తే అర్ధమవుతోంది. అదే సమయంలో తన సోదరుడు సోథన్‌ కనబడటం లేదని మోషే ఓర్‌ ఫిర్యాదు చేశాడు.

మరోవైపు హ‌మాస్ మిలిటెంట్లు ఓ జ‌ర్మ‌న్ (German) మ‌హిళ‌ను న‌గ్నంగా ఇజ్రాయెల్ వీధుల్లో ఊరేగించిన దారుణ ఘటన సైతం అక్కడ చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్క మీడియాలో లకలం రేపుతోంది. ఐతే ఈ వీడియోలోని ఆ యువతి ఇజ్రాయెల్‌ (Israel) కి చెందిన మహిళా సైనికురాలిగా గుర్తించారు. మొత్తానికి ఇజ్రాయెల్ పై హమాస్ మిలిటెంట్ల దాుల నేపధ్యంలో అక్కడి ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని, బిక్కు బిక్కుమంటూ జీవిస్తున్నారు. మరోవైపు భారత్ కు చెందిన పౌరులను సురక్షితంగా దేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.


Comment As:

Comment (0)