కాంగ్రెస్ పార్టీలో చేరనున్న మైనంపల్లి
బీఆర్ఎస్ కు మైనంపల్లి హన్మంతరావు రాజీనామా
పొలిటికల్ రిపోర్ట్- బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు (Mynampally Hanumantha Rao) పార్టీకి రాజీనా చేశారు. ఈమేరకు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కు రాజీనామా లేఖను పంపించారు. ఏ పార్టీలో చేరేది త్వరలో ప్రకటిస్తానని మైనంపల్లి హనుమంతా రావు చెప్పారు. మల్కాజిగిరి అసెంబ్లీ స్థానం అభ్యర్థిగా హన్మంతరావును ఇప్పటికే బీఆర్ఎస్ (BRS) ప్రకటించింది. మల్కాజిగిరి సీటు తనకు కేటాయించడంతో పాటు మెదక్ నుంచి తన కుమారుడికి టికెట్ ఇవ్వాలని, లేదంటే తాను, తన కొడుకు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీచేస్తామని హన్మంతరావు ఇటీవలే ప్రకటించారు. అంతే కాకుండా మంత్రి హరీశ్‌రావు (Harish Rao) పైనా మైనంపల్లి తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అభ్యర్థుల జాబితా ప్రకటించడానికి కొంత సమయానికి ముందు ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఐతే మైనంపల్లి హనుమంతా రావు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారని తెలుస్తోంది.