KTR BRS

రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారన్న ఆరోపణలు సరికాదు- కేటీఆర్‌

ఒకే బస్సులో కర్ణాటకకు వెళ్ధామా- కాంగ్రెస్ కు కేటీఆర్ సవాల్

ప్రెస్ క్లబ్ రిపోర్ట్- హైదరాబాద్‌లో నిర్వహించిన మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో మంత్రి, బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మాట్లాడారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారన్న ప్రతిపక్షాల ఆరోపణలను ఈ సందర్బంగా ఆయన కొట్టిపారేశారు. వృద్ధిరేటులో తెలంగాణ ఐదో స్థానంలో ఉందన్న కేటీఆర్‌, రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేశామని చెప్పారు. రుణాలు తెచ్చి ఉత్పత్తి రంగాల్లో పెట్టుబడులు పెట్టామని, సాగునీటి రంగం, మిషన్‌ భగీరథకు నిధులను ఉపయోగించామని స్పష్టం చేశారు కేటీఆర్. విద్యుత్‌ రంగంలో సంస్కరణలు, సంపద సృష్టించడం కోసం మాత్రమే అప్పులు తెచ్చామని చెప్పారు. 

భారత్ లో గత సంవత్సర కాలంలో 4.5 లక్షల మందికి ఉపాధి కల్పన జరిగితే, ఒక్క హైదరాబాద్‌ నుంచే 1.5 లక్షల ఉద్యోగాలు వచ్చాయని కేటీఆర్‌ ఈ సందర్బంగా చెప్పారు. తెలంగాణలో 2.2 లక్షల ఉద్యోగ నియామకాలు చేపట్టామన్న కేటీఆర్.. ఇప్పటికే 1.32 లక్షల ఉద్యోగాల భర్తీ జరిగిందన్నారు. మరో 90వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వివిధ దశల్లో ఉందని తెలిపారు. ప్రతీ జిల్లాకో మెడికల్ కాలేజ్ ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు కేటీఆర్. గతంలో వలసల జిల్లాగా ఉన్న పాలమూరు.. ఇప్పుడు ఇరిగేషన్‌కు పర్యాయపదంగా మార్చామని అన్నారు. 

కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలు 55 ఏళ్ల పాటు అవకాశం ఇచ్చారన్న కేటీఆర్.. కేంద్రంలో బీజేపీకి పదేళ్లు అవకాశం ఇచ్చారని చెప్పారు. వారికి ఏళ్ల తరబడి అవకాశం ఇచ్చినా అభివృద్ధి చేసిందేమీ లేదని విమర్శించారు. అభివృద్ధి ఆధారంగా తాము ఓట్లు అడుగుతుని.. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న బీజేపీ హామీ ఏమైందని కేటీఆర్ ప్రశ్నించారు. కర్ణాటకను మోడల్‌గా కాంగ్రెస్‌ నేతలు చూపుతున్నారని, కాని కర్ణాటక రైతులు రాష్ట్రానికి వచ్చి ఆందోళన చేస్తున్నారని అన్నారు. కర్ణాటకకు వెళ్లి రైతుల పరిస్థితి ఆరా తీద్దాం.. ఒకే బస్సులో వెళ్లేందుకు తాను సిద్దమన్న కేటీఆర్.. కాంగ్రెస్ నేతలు సిద్ధమా.. అని సవాల్ విసిరారు.


Comment As:

Comment (0)