దేవరలో సరికొత్త ఎన్టీఆర్ ను చూస్తారు..
ఎన్టీఆర్ దేవర మూవీ గ్లింప్స్ వచ్చేసింది
మూవీ రిపోర్ట్- జూనియర్ ఎన్టీఆర్ (NTR) హీరోగా, కొరటాల శివ డైరెక్షన్ లో రూపొందుతున్న యాక్షన్ డ్రామా మూవీ దేవర (Devara). అందాల తార జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ దేవరలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎన్టీఆర్ అభిమానులంతా ఎప్పుడెప్పుడు దేవర మూవీ నుంచి అప్‌డేట్ వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. దీంతో సోమవారం దేవర గ్లింప్స్‌ను (Devara Glimpse) రిలీజ్ చేసింది యూనిట్. ఇందులో ఇంతకుముందు ఎప్పుడూ చూడని సరికొత్త పాత్రలో ఎన్టీఆర్ కనిపించారు. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ఈ ఏడాది ఏప్రిల్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. రెండు భాగాలుగా దేవర సినిమాను రూపొందిస్తున్నారు. మరింకెందుకు ఆలస్యం. మీరు కూడా దేవర గ్లింప్స్ ను చూసేయండి.