kim jong un

ఉత్తర కొరియాలో ఆహార కొరత.. కిమ్ తాగే మద్యం బాటిల్ ధర 5లక్షలు

ఇంటర్నేషనల్ డెస్క్- ప్రపంచానికి అంతుచిక్కని ఉత్తర కొరియా (north korea) లో ఆహార సంక్షోభం అక్కడి ప్రజలను ఆకలి చావులకు గురిచేస్తోంది. లక్షలాది మంది జనం ఆహారం దొరక్క ఇబ్బంది పడుతున్నారు. ఐతే ఇటువంటి సమయంలో కూడా ఆ దేశ కిమ్‌ జోంగ్‌ ఉన్‌ (Kim Jong Un) విలాసాలు ఏమాత్రం తగ్గడం లేదు. ఉత్తర కొరియా నియంత విలాసవంతమైన జీవితం గడుపుతున్నట్లు ఇంగ్లండ్ రక్షణ రంగ నిపుణులు ఓ అంతర్జాతీయ న్యూస్ పేపర్ కు తెలిపారు. 

దేశంలో మెజార్టీ జనం ఆకలితో అలమటిస్తుంటే.. కిమ్‌ జోంగ్‌ ఉన్‌ సుమారు 7,000 డాలర్లు  అంటే 5లక్షల రూపాయలకు పైగా విలువ చేసే హెన్నెస్సీ మద్యాన్ని తాగుతున్నాడని వారు చెప్పారు. కిమ్‌ జోంగ్‌ ఉన్‌ తాగే ఈ మద్యం బ్రాండ్ల దిగుమతికే ప్రతి సంవత్సరం 30 మిలియన్‌ డాలర్ల అంటే మన కరెన్సీలో 247 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారని తెలిపారు. ఈ విషయాన్ని కొన్నేళ్ల క్రితం చైనా జనరల్‌ అడ్మిన్‌ స్ట్రేషన్‌ ఆఫ్‌ కస్టమ్స్‌ బహిర్గతం చేసినట్లుఇంగ్లండ్ రక్షణ రంగ నిపుణులు చప్పారు .

అంతే కాదు కిమ్‌ తనకు ఇష్టమైన బ్రెజిలీయన్‌ కాఫీ కోసం ప్రతి సంవత్సరం 9.6 లక్షల డాలర్లను ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక కిమ్ తాగే సిగిరెట్లు ప్రత్యేకమైన బంగారపు రేకుతో చుట్టి ఉంటాయని చెబుతున్నారు. కిమ్‌ మద్యం తోపాటు తినేందుకు ఇటలీలో ప్రత్యేకంగా పంది మాంసంతో తయారు చేసే పర్మా హామ్‌, స్విస్‌ చీజ్‌ను ఉత్తర కొరియా దేశం దిగుమతి చేసుకొంటోందంటే ఆయన విలాసం ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. మరి కిమ్ అంటే ఆశామాషి కాదు.


Comment As:

Comment (0)