Israel Flight

ఏ మాత్రం తేడా వచ్చినా అందరి ప్రాణాలు గాల్లోనే

రాకెట్‌ దాడుల మధ్య నుంచి ప్రయాణికుల విమానం- భయంకర వీడియో

ఇంటర్నేషనల్ రిపోర్ట్- హమాస్ కు ఇజ్రాయెల్‌ మధ్య బీకర యుధ్దం (Israel Hamas conflict) జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇజ్రాయెల్ గగనతలంలో ప్రయాణికుల విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో విమానం ప్రయాణిస్తోన్న టైంలో ఆ సమీపంలోనే ఇజ్రాయెల్ ఐరన్‌ డోమ్ (Iron Dome) రాకెట్లను పేల్చింది (Iron dome Defence System). ఏ మాత్రం తేడా వచ్చినా ప్రయాణికుల ప్రాణాలు క్షణాల్లో గాల్లో కలిసేవే. ఈ భయానక దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇజ్రాయెల్‌(Israel) నగరం టెల్‌అవీవ్‌లో దిగేందుకు ఆ ప్రయాణికుల విమానం వెళ్తోంది. సరిగ్గా అదే టైంలో ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ హమాస్ రాకెట్లను ఎదుర్కొంటూ.. వాటిని ఎప్పటికప్పుడు పేల్చివేస్తోంది. ప్రయాణికుల విమానానికి, భారీ పేలుళ్లకు పెద్దగా దూరం చాలా తక్కువగా ఉంది. దీంతో జార్జియా నుంచి వచ్చిన ఈ ప్రయాణికుల విమానం షెడ్యూల్ టైం కంటే 15 నిమిషాలు ఆలస్యంగా టెల్‌అవీవ్‌లో ల్యాండ్ అయిందని అధికారులు తెలిపారు. వైమానిక దాడులు జరుగుతున్న సమయంలో ఆ విమానం ఇజ్రాయెల్ చేరుకుంది.

 


Comment As:

Comment (0)