Banana Tamota

అరటి పండ్ల ధరలకు రెక్కలు

టమాట తగ్గింది.. అరటి పండు ఎక్కింది

స్పెషల్ రిపోర్ట్- నిన్నటి వరకు టమాట ధరలు చుక్కలు చూపించాయి. ఓ దశలో కిలో టమాట (Tamota) 180 రూపాయల వరకు వెళ్లింది. దీంతో చాలా మంది కూరల్లో టమాట వేయడమే మానేశారంటే ఎంతలా ప్రభావం చూపించిందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో ఇప్పుడిప్పుడే టమాటా ధరలు (Tamota Price) సామాన్యులకు అందుబాటు ధరల్లోకి వస్తున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నా టమాటా ధర ఇలా తగ్గిందో లేదో.. అరటి పండ్ల (Banana) ధర పెరిగింది. అవును ఇటీవల అరటి పండ్ల ధరలకు రెక్కలు వచ్చాయి. ప్రస్తుతం అరటి పండ్లు కేజీ వంద రూపాయలు దాటింది. 

కర్ణాటక రాజధాని బెంగళూరులో (Bangalore) కిలో అరటి పండ్ల (Banana Price) ధర 100 రూపాయలు దాటింది. దీంతో అరటి పండ్ల ధరలు చూసి కొనుగోలుదారులు బెంబేలెత్తిపోతున్నారు. బెంగళూరు సిటీలో అమ్మే అరటి పండ్లలో చాలా శాతం తమిళనాడు నుంచి సరఫరా అవుతాయి. ఎలక్కిబలే, పచ్‌బలే రకం అరటి పండ్లను బెంగళూరు నగర వాసులు ఎంతో ఇష్టంగా తింటారు. డిమాండ్‌ కు తగిన సరఫరా లేకపోవడంతోనే అరటి పండ్ల ధరలు పెరుగుతున్నట్లు వ్యాపారస్తులు చెబుతున్నారు.


Comment As:

Comment (0)