Sidharth Luthra

రాజమహేంద్రవరం జైలులో కేసుల గురించి చర్చించిన సిద్ధార్థ లూథ్రా 

జైలులో చంద్రబాబును కలిసిన సుప్రీం కోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా

ఆంధ్రప్రదేశ్ రిపోర్ట్- తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును (Chandrababu) రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఆయన కేసును వాదిస్తున్న సుప్రీం కోర్టు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా (Siddharth Luthra) కలిశారు. సుమారు 40 నిమిషాల పాటు చంద్రబాబు తో ములాఖత్‌ అయ్యారు లూథ్రా. హైకోర్టులో బుధవారం జరిగిన పరిణామాలు, తదుపరి కార్యాచరణను చంద్రబాబుకు వివరించినట్టు తెలుస్తోంది. చంద్రబాబుతో ములాఖత్‌ తర్వాత, చంద్రబాబు కుటుంబ సభ్యులు, టీడీపీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు సిద్దార్త్ లూథ్రా. చంద్రబాబుతో సమావేశం సందర్బంగా చర్చించిన విషయాలు, న్యాయ పరంగా తీసుకోవాల్సిన అంశాలపై చర్చించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.

ఇక చంద్రబాబును కలిసేముందు సిద్ధార్థ లూథ్రా చేసిన ట్వీట్‌ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. అన్ని ప్రయత్నాలు చేసినా... న్యాయం కనుచూపుమేర లేకుంటే ఇక కత్తిపట్టడమే.. పోరాటానికి ఇదే సరైన విధానం.. అంటూ గురుగోవింద్‌ సింగ్‌ సూక్తులు ప్రస్తావిస్తూ సిధ్దార్థ్ లూథ్రా ట్వీట్టర్లో పేర్కొన్నారు. ఏసీబీ కోర్టు, ఏపీ హైకోర్టులో చంద్రబాబు తరఫున సుప్రీం కోర్టు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదిస్తున్న సంగతి తెలిసిందే. Siddharth Luthra Tweet


Comment As:

Comment (0)