ముంబయి ఎయిర్ పోర్ట్ లో బంగ్లా దేశీయుడి అరెస్ట్
విమానంలో ఎయిర్ హోస్టెస్‌కు ముద్దు పెట్టేందుకు యత్నం
స్పెషల్ రిపోర్ట్- ఈ మధ్యకాలంలో విమాన (Flight) జర్నీలో పలు విచిత్రకమరమైన, ఆందోళనకరమైన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఫ్లైట్ లో ఎయిర్ హోస్టెస్‌కు (Air Hostess) ముద్దు పెట్టేందుకు ప్రయత్నించాడు ఓ బంగ్లాదేశ (Bangladeshi National) ప్రయాణికుడు. ఈ నెల 6న విస్తారా విమానం యూకే 234 మస్కట్ నుంచి ఢాకా కు బయలుదేరింది. గురువారం ఉదయం మరికాసేపట్లో విమానం ముంబయిలో (Mumbai) ల్యాండ్ అవుతుందనగా అందులో ప్రయాణిస్తున్న మహమ్మద్ దులాల్ (Mohammed Dulal ) అనే వ్యక్తి తన సీటు నుంచి లేచి పక్కనే ఉన్న ఎయిర్ హోస్టెస్‌ను కౌగిలించుకున్నాడు. అసలు ఏంజరిగిందో అర్ధం కాక ఆమె తేరుకునే లోపే ముద్దు పెట్టేందుకు యత్నించాడు.
విమానంలో ఉన్న మిగతా ప్రయాణికులు అతడిని వారించే ప్రయత్నం చేశారు. మిగతా సిబ్బంది మందలించిగా వారితోనూ మిస్ బిహేవ్ చేశాడు. ఆఖరికి కెప్టెన్ జోక్యం చేసుకొని రెడ్ వార్నింగ్ కార్డ్ చదివి ఆ ప్రయాణికున్ని వికృత ప్రయాణికుడిగా ప్రకటించాడు. ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో విమానం ల్యాండ్ అయిన వెంటనే నిందితుణ్ని భద్రతా సిబ్బందికి అప్పగించారు. వారు అతడిని సహర్ పోలీస్‌స్టేషన్ ను తరలించారు. ఎయిర్ హోస్టెస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుణ్ని అరెస్టు చేశారు. స్థానిక కోర్టులో అతడిని హాజరుపరచగా శుక్రవారం వరకు పోలీసు కస్టడీలో ఉంచాలని న్యాయమూర్తి ఆదేశించారు.