విశాఖపట్నంలో 75 అడుగుల బెల్లం కందుల వినాయకుడు
వినాయక చవితి దగ్గరపడుతోంది. దీంతో ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో భారీ వినాయక విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. విశాఖ నగరపాలక పరిధిలోని గాజువాక డిపో వద్ద లంబోదర ట్రస్టు ఆధ్వర్యంలో అత్యంత భారీ వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఐతే ఈ సారి ఈ భారీ వినాయకుడి విగ్రహాన్ని బెల్లం కుందులతో (jaggery ganesh Idol) రూపొందిస్తుండటం విశేషం. మొత్తం 75 అడుగుల ఎత్తయిన విగ్రహా నిర్మాణం కోసం 18 నుంచి 20 టన్నుల బెల్లం కుందులను వినియోగిస్తున్నట్లు లంబోదర ట్రస్టు ప్రతినిధులు తెలిపారు. బెల్లం కందులతో రూపొందుతున్న వినాయకుడిని చూసేందుకు స్థానికులు ఆసక్తిచూపుతున్నారు.