Anushka

మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి తో ప్రేక్షకుల ముందుకు స్వీటీ

అది లేకుండా పెళ్లి చేసుకున్నా ఉపయోగం ఉండదు- అనుష్క

మూవీ రిపోర్ట్ - తాను పెళ్లికి ఏ మాత్రం వ్యతిరేకం కాదంటోంది స్వీటీ. పెళ్లి, పిల్లలు, కుటుంబ బంధాలు.. ఇవన్నీ చాలా అందంగా ఉంటాయని చెప్పింది. ఐతే ఈ ప్రక్రియంతా ఆర్గానిక్‌గా జరగాలని తాను నమ్ముతానని చెప్పుకొచ్చింది అనుష్క (Anushka). దానికి సరైన సమయం రావాలన్న జేజేమ్మ.. పెద్దలు కుదిర్చిన పెళ్లైనా, ప్రేమ పెళ్లైనా అందులో ఎమోషన్‌ ఉండాలని అభిప్రాయపడింది. ప్రేమ, ఎమోషన్‌ లేకుండా ఏ పెళ్లి చేసుకున్నా ఉపయోగముండదని తన మనసులోని మాట చెప్పింది అనుష్క.

అనుష్క నటించిన తాజా సినిమా మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి (miss shetty mr polishetty) ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. నవీన్ పొలిశెట్టి హీరో. వినోదం, భావోద్వేగాలు కలగలిసి ఉన్న కొత్తదనం నిండిన సినమా మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి అని, ఖచ్చితంగా ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని చెప్పింది అనుష్క. ఇక మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి సినిమాకు తానే మొదటి ప్రేక్షకుణ్ని అని మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) చెప్పారు. వినోదాన్ని, భావోద్వేగాల్ని అద్భుతంగా మిళితం చేసి రక్తి కట్టించేలా మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి చిత్రాన్ని తెరకెక్కించారని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు చిరంజీవి.
 


Comment As:

Comment (0)