Do not Store Eggs in Fridge... Know the reason here

కోడి గుడ్లతో బీ కేర్ ఫుల్

మీరు కోడి గుడ్లను ఫ్రిజ్‌లో పెడుతున్నారు.. అయితే ఒక్క నిమిషం ఈ స్టోరీ చదవండి..


సాధారణంగా మనమంతా కోడి గుడ్లను ఫ్రిజ్‌లో పెడుతుంటాం. కోడి గుడ్లు పాడు కాకూడదని ఇలా చేస్తుంటాం. కానీ కోడి గుడ్ల సంగతేమో కానీ... ఇలా ఫ్రిజ్‌లో చాలా రోజులు దాచిన కోడి గుడ్లను తింటే మాత్రం మన ఆరోగ్యం అనారోగ్యం బారిన పడుతుందని ఓ అధ్యయనం స్పష్టం చేస్తోంది. 


మాములుగా మన ఇంట్లో ఉండే ఫ్రిజ్‌లో కోడి గుడ్లు పెట్టుకునేందుకు స్పెషల్ రాక్‌ కూడా ఉంది.. మరి ఎందుకు అందులో పెట్టరాదు. మెమెప్పుడు అలాగే పెడతాం... ఇలా పెడితేనే ఎక్కువ రోజులు కోడి గుడ్లు ఫ్రెష్‌గా ఉంటాయని కొంతమంది వాదన. కానీ ఇలా ఫ్రిజ్‌లో ఉంచితే వాటిలో ఎక్కువ శాతం బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇవి తిన్నప్పుడు వాటి ద్వారా మనకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని వైద్యులు చెప్తున్నారు. 


గుడ్లలోని పోషకాలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్యాల్షియం, ప్రొటీన్ వంటివి కోడి గుడ్లలో పుష్కలంగా లభిస్తాయి. అందుకే చాలా మంది కోడి గుడ్లను తింటారు. కొంచెం బలహీనంగా ఉన్న వ్యక్తికి కూడా డాక్టర్లు రోజుకో కోడి గుడ్డు తినాలని సూచిస్తారు. ఇదంతా కరెక్టే. కానీ ఇలా ఫ్రిజ్‌లో దాచిన గుడ్లు తింటే అనారోగ్యం తప్పదంటున్నారు వైద్యులు. 

చల్లని వాతావరణంలో ఉన్న గుడ్లను రూమ్‌ టెంపరేచర్‌ వద్దకు తేగానే వాటిలో బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంది. టెంపరేచర్లు మారడంతో జరిగే కండెన్సేషన్‌ కారణంగా గుడ్లపై ఉన్న పొట్టుపై బ్యాక్టీరియా వేగంగా పెరుగుతుంది. దీంతో ఇలాంటివి తింటే అనారోగ్యం తప్పదు. అందుకే రూం టెంపరేచర్ వద్ద మాత్రమే గుడ్లను నిల్వ చేయాలి. ఎక్కువ చల్లగా లేదా ఎక్కువ వేడిగా ఉన్న వాతావరణంలో కోడిగుడ్లను అస్సలు నిల్వచేయరాదు. 

గది ఉష్ణోగ్రతల వద్ద నిల్వ ఉంచిన కోడి గుడ్లను 1 నుంచి 3 వారాల్లోగా ఉపయోగించాల్సిందే. కానీ ఫ్రిజ్‌లో ఉంచి గుడ్లను మరింత ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంచి వండుకోవచ్చు. కానీ ఇలా ఫ్రిజ్‌లో పెట్టిన కోడిగుడ్లకు ఫ్రిజ్‌లో ఉన్న మిగతా పదార్ధాల వాసనలు అంటుతాయి. సాధారణంగా ఫ్రిజ్‌ డోర్‌లోనే వీటిని నిలువ చేస్తాం. అయితే ఫ్రిజ్‌ డోర్ పదేపదే వేయడం తీయడంతో డోర్‌లో ఉన్న గుడ్ల ఉష్ణోగ్రతల్లో మార్పులపై ప్రభావం ఉంటుంది. దీంతో బ్యాక్టీరియా పెరుగుతుందన్నమాట. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో కోడిగుడ్లను ఫ్రిజ్‌లో ఉంచాల్సి వస్తే ముందు ఒక బలమైన కార్టన్ బాక్స్ లేదా గాలి దూరని డబ్బాలో వీటిని పెట్టి, ఫ్రిజ్‌ వెనుకల భాగంగా పెట్టాలి. డోర్‌లో మాత్రం పెట్టొద్దు. 


కోడిగుడ్లతో పాటు మరికొన్ని పదార్థాలను ఫ్రిజ్‌లో పెట్టరాదు. ఉదాహరణకు ఆలూని ఫ్రిజ్‌లో ఉంచాల్సిన అవసరం లేదు. అలాగే వెల్లుల్లి, ఉల్లిపాయలు, వంకాయలు, అరటిపళ్లను ఫ్రిజ్‌లో నిల్వ ఉంచకండి. టమెటాలను కూడా ఫ్రిజ్‌లో ఉంచవద్దని న్యూట్రిషనిస్టులు సలహా ఇస్తున్నారు. 


Comment As:

Comment (0)