Diabetes

షుగర్ పేషెంట్లకు ఇది దివ్య ఔషధం

షుగర్ పేషెంట్లకు ఇది దివ్య ఔషధం

హెల్త్ డెస్క్- ఈ మధ్య కాలంలో షుగర్ పేషెంట్లు పెరిగిపోతున్నారు. మరీ ముఖ్యంగా మన భారత దేశంలో షుగర్ పేషెంట్ల సంఖ్య అధికంగా ఉందని లెక్కలు చెబుతున్నాయి. చిన్న వయసులోనే చాలా మంది షుగర్ వ్యాధి భారిన పడుతున్నారు. ఈ నేపధ్యంలో షుగర్ పేషెంట్లకు ఆయుర్వేద వైద్యులు పలు ఆరోగ్య చిట్కాలు సూచిస్తున్నారు..
అందులో ప్రధానమైంది.. మెంతులు రెండు చెంచాలు, లేత వేప చిగురు, కాకరకాయ, బోగన్‌ విల్లా లేత చిగుర్లు (ఎనిమిది లేక పది) తింటే మధుమేహం అదుపులో ఉంటుంది.

ఇక ఒక కాకరకాయ, ఒక కీర కాయ, ఒక టమోటా పండు, పది తెల్ల బిళ్లగన్నేరు పూలు, పది వేప చిగుళ్ళు కలిపి కొంచెం నీళ్ళు కలిపి రసం తీసి, ఒక సీసాలో పోసుకుని ఫ్రిజ్‌లో భద్రపరచి పరగడుపున ఒక చెంచా రసం తాగితే షుగర్ పేషెంట్లకు ఇది దివ్య ఔషధమని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.


Comment As:

Comment (0)