స్వామి రారా ఈవెంట్ లో సందడి చేసిన జంట

నరేశ్‌ కు పవిత్రా లోకేశ్‌ పెట్టిన ముద్దుపేరు తెలుసా..

ఎంటర్టైన్మెంట్ రిపోర్ట్- నరేశ్‌ (Naresh), పవిత్రా లోకేశ్ (Pavitra Lokesh) ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. వీళ్లిద్దరు త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారన్న ప్రచారమూ జరుగుతోంది. అప్పటి వరకు ఇద్దరు కలిసి రిలేషన్ షిప్ లో ఉన్నారని తెలుస్తోంది. ఇదంతా పక్కన పెడితే నరేశ్, పవిత్రా లోకేశ్ లు ఇద్దరు ఈటీవీ (Etv) లో నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమానికి విచ్చేసి సందడి చేశారు. వినాయక చవితి పండగంటే వేళ ప్రేక్షకులకు మరింత వినోదం పంచేందుకు స్వామి రారా (Swamy Ra Ra) పేరిట ఈటీవీ ఓ స్పెషల్‌ ఈవెంట్‌ ను రూపొందించింది.

ఈ కార్యక్రమంలో నరేశ్, పవిత్రా లోకేశ్ పాల్గొన్నారు. వాళ్లిద్దరు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఐతే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే నరేశ్ కు పవిత్రా లోకేశ్‌ ఓ ముద్దుపేరు పెట్టింది. అది విని స్వామి రారా ఈవెంట్ లో పాల్గొన్న అందరూ అవాక్కైపోయారు. మరి నరేశ్ కు పవిత్ర పెట్టిన ముద్దు పేరు ఎంటో తెలుసుకోవాలంటే మాత్రం వినాయకచవితి రోజు ఈటీవీలో ప్రసారం అయ్యే స్వామి రారా అన్న కార్యక్రమం చూడాల్సిందే. అందుకు సంబందించిన ప్రోమో ముందుగా చూసేయండి..


Comment As:

Comment (0)