బాలయ్య అన్ స్టాపబుల్ లో సందడి చేసిన రష్మిక, రణ్ బీర్
రష్మిక- విజయ్ దేవరకొండ గురించి సీక్రెట్ చెప్పిన రణ్‌బీర్
మూవీ రిపోర్ట్- అన్‌స్టాపబుల్ (Unstoppable) నందమూరి బాలకృష్ణ (Balakrishna) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న సెలబ్రిటీ టాక్ షో. ఆహా వేదికగా స్ట్రీమింగ్ అవుతోన్న అన్‌స్టాపబుల్ షో ఎంత పాపులరో అందరికి తెలిసిందే. ఈ షోలో తాజాగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, రష్మిక, రణ్‌బీర్ కపూర్ పాల్గొని సందడి చేశారు. రణ్ బీర్ కమూప్ తాజా సినిమా యానిమల్ ప్రమోషన్స్‌లో భాగంగా వీళ్లు అన్‌స్టాపబుల్ షో లో పాల్గొన్నారు. ఓ టాస్క్‌లో భాగంగా యానిమల్ (Animal) టీమ్.. హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)కు కాల్ చేసింది. విజయ్ మాట్లాడుతుండగా.. స్పీకర్ ఆన్‌లో ఉందంటూ రష్మిక (Rashmika) కామెంట్ చేసింది. వెంటనే రణ్‌బీర్ కపూర్ ఫోన్ తీసుకుని.. విజయ్.. మేము బాలకృష్ణ షోలో ఉన్నాం.. స్క్రీన్‌పై అర్జున్‌రెడ్డి, యానిమల్ పోస్టర్లు చూపించి.. ఏ సినిమా అంటే ఇష్టమో రష్మికను చెప్పమన్నారు. ఆమె ఏం చెబుతుందో చూద్దామని టాస్క్ గురించి చెప్పాడు.
దీంతో.. అర్జున్ రెడ్డి తో తనకొక ప్రత్యేక అనుబంధం ఉందని రష్మిక అన్నారు. హైదరాబాద్ వచ్చిన టైంలో తాను చూసిన మొదటి సినిమా అర్జున్ రెడ్డి అని చెప్పారు. అక యానిమల్ తాను వర్క్ చేసిన సినిమా కాబట్టి రెండూ సినిమాలు తనకు ఇష్టమైనవేనని తెలివిగా సమాధానం చెప్పారు రష్మిక. ఇంతలో రణ్‌బీర్ కల్పించుకుని.. సర్ మీకొక విషయం చెప్పాలి.. విజయ్ వాళ్ల ఇంటి మేడ మీద జరిగిన అర్జున్‌రెడ్డి సక్సెస్ పార్టీలో తొలిసారి సందీప్‌రెడ్డి.. రష్మికను కలిశారు.. అని అన్నాడు. ఆయన మాటలతో ఒక్కసారిగా షాకైన రష్మిక.. ఈ విషయాలు ఇక్కడ అవసరం లేదు కదా అని నవ్వేసింది. ఆ పార్టీకి ఎవరు పిలిచారని బాలకృష్ణ అడగ్గా అందరూ నవ్వేశారు.