సుధీర్-రష్మి కాంబినేషన్ లో సినిమా..
రష్మితో సుడిగాలి సుధీర్ సినిమా
మూవీ రిపోర్ట్- సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer), రష్మి గౌతమ్ (Rashmi Gautam).. వీళ్లిద్దరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుధీర్, రష్మిలు జబర్దస్త్ కామెడీ షో ద్వార సెలబ్రెటీలయ్యారు. ఆ తరువాత సుడిగాలి సుధీర్ వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ హీరోగా కూడా సినిమాలను చేస్తుండగా, రష్మి సైతం జబర్దస్త్ షో చేస్తూనే అటు సినిమాల్లో, ఇటు డిఫరెంట్ షోలను చేస్తోంది. ఈ క్రమంలోనే సుధీర్-రష్మి జోడికి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వీళ్లిద్దరూ కలిసి బుల్లితెర స్క్రిన్ మీద కనిపిస్తే చాలు ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేస్తారు. దీంతో సుధీర్, రష్మి జోడి వెండితెరపై ఎప్పుడు కనిపిస్తుందా అని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. దీనికి సుడిగాలి సుధీర్ తాజాగా ఆసక్తికరమైన సమాధానం చెప్పారు.
సుధీర్ హీరోగా నటిస్తోన్న మూవీ కాలింగ్ సహస్ర డిసెంబర్ 1న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో.. రష్మి హీరోయిన్ గా సినిమా ఎప్పుడు చేస్తారనే ప్రశ్నకు.. నేను, రష్మి ఇద్దరం కథలు వింటున్నాం.. మా ఇద్దరికీ కామన్ గా నచ్చిన కథ ఇప్పటి వరకు రాలేదు.. ఒకవేళ అలాంటిద కధ దొరికితే ఖచ్చితంగా నేను, రష్మి కలిసి తప్పకుండా నటిస్తాం.. అని చెప్పారు సుడిగాలి సుధీర్. ఆ సమయం తొందరగా రావాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.