బేబి కి క్యూ కట్టిన సినిమా ఛాన్స్ లు
ఆ రెండు సినిమాల్లో హీరోయిన్ గా వైష్ణవి చైతన్య
మూవీ రిపోర్ట్- వైష్ణవి చైతన్య (vaishnavi chaitanya).. బేబి (Baby) సినిమాతో ఒక్కసారిగా స్టార్ అయిపోయింది. పదహారణాల తెలుగు అందం, సహజమైన నటనతోనూ ఇండస్ట్రీలో అందరి చూపలో పడింది ఈ బేబీ. తన మొదటి సినిమా బేబీ విజయంతో వైష్ణవికి అవకాశాలు క్యూ కట్టాయి. ఈ క్రమంలో ఇప్పటికే రెండు సినిమాలను ఓకే చేసింది. సిద్ధు జొన్నలగడ్డ (siddhu jonnalagadda), ఆశిష్ హీరోలుగా నటిస్తున్న సినిమాల్లో హీరోయిన్ గా వైష్ణవి చైతన్య సెలెక్ట్ అయ్యింది.
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో రాబోతున్న సినిమాకు సైన్ చేసింది వైష్ణవి చైతన్య. ఈ మూవీకి బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మాత. ఇక ఆశిష్ హీరోగా అరుణ్ భీమవరపు దర్శకత్వంలో రాబోతున్న సినిమాలోను వైష్ణవి హీరోయిన్ గా చేస్తోంది. దిల్‌రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి, నాగార్జున మల్లిడి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మరికొన్ని కధలు చర్చల దశలో ఉన్నాయని, డేట్స్ ను బట్టి వాటికి సైతం వైష్ణవి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.