Weekly Horscope

ఈ వారం ఏ రాశివారికి ఎలాంటి ఫలితం ఉంటుందంటే..

ఈ వారం రాశిఫలం - సెప్టెంబరు 3 - సెప్టెంబరు 9

 స్పెషల్ రిపోర్ట్- ఈ వారం సెప్టెంబరు 3  నుంచి సెప్టెంబరు 9 వరకు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

మేష రాశి (Aries)- మేషరాశి వారికి శుభయోగాలు గోచరిస్తున్నాయి. అనుకున్న పనులు నెరవేరుతాయి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేయండి. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. స్థిరచిత్తంతో పనిచేయాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకుని బాధ్యతలను పూర్తిచేయాలి. బిజినెస్ లో శ్రద్ధ తీసుకోవాలి. స్నేహితుల సూచనలు పనిచేస్తాయి. ఇష్టదైవాన్ని స్మరిస్తే శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుంది.


వృషభరాశి (Taurus)- వృషభరాశి వారికి వ్యాపారయోగం బ్రహ్మాండంగా ఉంది. క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు. ఈ రాశి వారికి ఆర్థికస్థితి బాగుంటుంది. ముందుగా అనుకున్న విధంగానే పనులు ప్రారంభించాలి. పనులను మధ్యలో మార్చవద్దు. ఉద్యోగంలో ఎప్పటి పనులు అప్పుడే పూర్తిచేయాలి.  వాయిదాలు వేయవద్దు. కొన్ని సందర్భాల్లో సూర్యదోషం ఇబ్బంది కలిగిస్తుంది. కుటుంబసభ్యుల సూచనలు మేలుకలిగిస్తాయి. ఇష్టదైవాన్ని స్మరిస్తే మంచి జరుగుతుంది.


మిధున రాశి (Gemini)- మిధున రాశి వారికి అదృష్టకాలం. వీరికి విశేషమైన శుభాలు కలుగుతాయి. ఉద్యోగంలో ప్రశంసలు లభిస్తుంది. ఏ పని చేసినా లాభం ఉంటుంది. భూ గృహ వాహనాది యోగాలు గోచరిస్తున్నాయి. వస్తుప్రాప్తి కనిపిస్తోంది. జీవితాశయాలపై దృష్టి పెట్టాలి. చంచల నిర్ణయాలు ఏ మాత్రం పనికిరావు. ఎదురు చూస్తున్న పనుల్లో మంచి ఫలితాలు పొందుతారు. ఇతరులపై ఆధారపడకూడదు. లక్ష్మీధ్యానం శుభం చేకూరుస్తుంది.


కర్కాటక రాశి (Cancer sign)- కర్కాటక రాశి వారికి ఇది అనుకూల కాలం. విజయావకాశాలు మెండుగా ఉన్నాయి. సకాలంలో బాధ్యతలను పూర్తిచేయండి. వ్యాపారయోగం శుభప్రదం. లాభాలను గడిస్తారు. కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. పెట్టుబడులు లాభాన్నిస్తాయి. ధర్మమార్గంలో ప్రయత్నం చేయాలి. పట్టువిడుపులు అవసరం. ఉద్యోగంలో శ్రద్ధపెట్టాలి. సూర్యనారాయణ మూర్తిని స్మరిస్తే మంచి జరుగుతుంది.


సింహ రాశి (Leo sign)- సింహ రాశి వారికి ముఖ్యకార్యాల్లో విజయం చేకూరుతుంది. అనుకున్న సమయానికన్నా ముందుగానే పనులు మొదలుపెట్టాలి. ఏకాగ్రతతో చేసే పనులు మంచి ఫలితాన్నిస్తాయి. ఉద్యోగంలో జాగ్రత్త అవసరం. కాలం వ్యతిరేకంగా ఉండటంతో సంభాషణల్లో స్పష్టత అవసరం. నమ్మకమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఓర్పుతో పనిచేయడం అవసరం. ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి. సూర్యారాధన మంచి చేస్తుంది.


కన్య రాశి (Virgo)- కన్స రాశి వారికి ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయాలి. మనోబలం చాలా ముఖ్యం. మీకు లక్ష్యం స్పష్టంగా ఉండాలి. మొహమాటంవల్ల కొన్ని సమస్యలు రాకుండా జాగ్రత్తపడాలి. డబ్బు ఏ మాత్రం వృథా చేయవద్దు. ఇతరుల విషయాల్లో తలదూర్చకపోవడం మంచిది. వారం మధ్యలో తెలియని ఆటంకాలు ఏర్పడతాయి. ఆత్మీయుల సూచనలు మంచిచేస్తాయి. ఇష్టదైవాన్ని స్మరిస్తే అనుకున్నది సాధిస్తారు. 


తుల రాశి (Libra)- తుల రాశి వారికి ఇది మంచి సమయం. అనుకున్న పనులు త్వరగా అవుతాయి. ఉద్యోగంలో ఉన్నతస్థితి కనిపిస్తుంది. అనుకున్న పనుల్లో అభివృద్ధి ఉంటుంది. మీ ఆశయం నెరవేరుతుంది. లక్ష్యాలను సకాలంలో పూర్తిచేయడం ద్వారా లాభాలు పొందవచ్చు. బిజినెస్ లో కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి. శత్రుదోషం తొలగిపోతుంది. స్నేహ బలం
పెరుగుతుంది. ఇష్టదైవస్మరణ మంచిచేస్తుంది.


వృశ్చిక రాశి (Scorpio)- వృశ్చిక రాశి వారికి శుభఫలితాలు కనిపిస్తున్నాయి. ధైర్యంగా కర్తవ్యాన్ని నిర్వహించాలి. వీరికి పెద్దల సహకారం ఉంటుంది. అధికార యోగం గోచరిస్తుంది. విఘ్నాలను అధిగమించి లక్ష్యాన్ని చేరుకుంటారు. ధనయోగం కనిపిస్తోంది. అదృష్టవంతులవుతారు. వచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకోవాలి. చంచలత్వం ఏ మాత్రం పనికిరాదు. విష్ణు నామస్మరణ చేస్తే వారాంతంలో మంచి జరుగుతుంది.


ధనుస్సు రాశి (Sagittarius)- ధనుస్సు రాశి వారికి విశేషమైన ఫలితాలున్నాయి. ఉద్యోగంలో ప్రశంసలు పొందుతారు. సమయానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలి. గతానుభవం పనికొస్తుంది. కొత్త ప్రయత్నాలు ప్రారంభించకపోవడమే మంచిది. స్నేహితుల సహకారంతో లక్ష్యాన్ని చేరతారు. సొంతంగా చేసే పనుల్లో అధిక లాభాలుంటాయి. ఎవరితోనైనా మంచిగా మాట్లాడాలి. ఇష్టదేవతాధ్యానం మంచిచేస్తుంది.


మకర రాశి  (Capricorn)- మకర రాశి వారు ప్రతి అడుగూ ఎంతో జాగ్రత్తగా వేయాలి. కాలం కొంత వ్యతిరేకంగా ఉంది. కొన్ని ఆటంకాలున్నాయి. ధర్మమార్గంలో నిర్ణయాలు తీసుకుని అమలుచేయాయి. ఆత్మీయుల సలహాలు మేలు కలిగిస్తాయి. ఉద్యోగంలో జాగ్రత్త అవసరం. ఇబ్బంది కలిగించేవారుంటారు, వారితో శాంతంగా మాట్లాడాలి. భవిష్యత్తు అవసరాల్ని దృష్టిలో పెట్టుకుని ప్రయత్నించాలి. నవగ్రహ శ్లోకాలు చదివితే మంచిజరుగుతుంది.


కుంభ రాశి (Aquarius)- కుంభ రాశి వారు పట్టుదలతో చేసే పనుల్లో విజయం సాధిస్తారు. ధర్మబద్ధంగా అనుకున్న మార్గంలో ముందుకు సాగాలి. వీరికి  కాలం వ్యతిరేకంగా ఉంది. ఐతే దేనికీ భయపడవద్దు, తొందరపాటు అస్సలే పనికిరాదు. ఎవరేమన్నా మనసుమీదికి తీసుకోవద్దు. ఆర్థిక నష్టాలు రాకుండా ప్రణాళికతో పనిచేయాలి. ముఖ్యమైన పనులను కొంతకాలం వాయిదా వేయడం మంచిది. కొత్త పనులు అస్సలే మొదలుపెట్టకూడదు. నవగ్రహశ్లోకాలు చదువితే మంచిజరుగుతుంది.


మీన రాశి (Pisces)- మీన రాశి వారికి ఇది శుభకాసమయం. వీరు అదృష్టవంతులు అవుతారు. చేసే ఉద్యోగంలో కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. స్థిరమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. తోటివారి ప్రోత్సాహం లభిస్తుంది. ఆనందించే అంశాలున్నాయి. అధికార యోగం కనిపిస్తోంది. కొత్తగా చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. బిజినెస్ లో కలిసివస్తుంది. అనుకున్నది జరుగుతుంది. ఇష్టమైన వ్యక్తుల్ని కలిసే అవకాశం ఉంది. మహాలక్ష్మిని ధ్యానిస్తే శుభం జరుగుతుంది.

జాతకాలు, రాశి ఫలితాలు కేవలం నమ్మకం, ధైర్యం మాత్రమే, కష్టపడి పనిచేయకపోతే ఏదీ సాధ్యం కాదు.
 


Comment As:

Comment (0)