హీరో సుహాస్ ఖాతాలో మరో హిట్ పడిందా
సినిమా రివ్యూ- ప్రసన్నవదనం..
సినిమా- ప్రసన్నవదనం (Prasanna Vadanam Review)
తారాగణం- సుహాస్, రాశీసింగ్, పాయల్ రాధాకృష్ణ, నందు, వైవా హర్ష, నితిన్ ప్రసన్న తదితరులు
మ్యూజిక్- విజయ్ బుల్గానిన్
సినిమాటోగ్రఫీ- ఎస్.చంద్రశేఖరన్
నిర్మాతలు- మణికంఠ జేఎస్, ప్రసాద్‌రెడ్డి టీఆర్
రచన, దర్శకత్వం- అర్జున్ వైకే
విడుదల- 03-05-2024
సినిమా రిపోర్ట్- సుహాస్ కొత్త కథలకి కేరాఫ్ గా పేరుతెచ్చుకున్నాడు. కలర్ ఫొటో సినమాతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుహాస్.. అప్పటి నుంచి అదే స్టైల్లో వెళ్తున్నాడు. చాలా సింపుల్ గా పక్కింటి అబ్బాయిని గుర్తు చేసే పాత్రలను ఎంచుకుంటూ.. అందరిని హత్తుకునే కధల ఎంపికతో ఆకట్టుకుంటున్నాడు. ఈ మధ్య వచ్చిన అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ సినిమా తర్వాత సుహాస్ ఇప్పుడు ప్రసన్న వదనం (Prasanna Vadanam) మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.
ప్రసన్న వదనం కధ.. Prasanna Vadanam Review
ఇక కధలోకి వెళ్తే.. సూర్య (సుహాస్) రేడియో జాకీగా పనిచేస్తుంటాడు. ఈ క్రమంలో ఒక యాక్సిడెంట్ అతని జీవితాన్ని మొత్తం మార్చెస్తుందు. ఈ ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోవడంతో పాటు, ఫేస్ బ్లైండ్ నెస్ అనే వింత సమస్య బారిన పడతాడు. ఫేస్ బ్లైండ్‌నెస్‌తో ఎవరి మొహాల్నీ గుర్తు పట్టలేని, వాయిస్‌నీ గుర్తించలేని స్థితికి వస్తాడు. తన ఫ్రెండ్ విఘ్నేష్ (వైవా హర్ష)కి తప్ప తన ఈ వింత సమస్య ఎవరికీ తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తుంటాడు. ఇంతలో ఆద్య (పాయల్ రాధాకృష్ణ)తో ప్రేమలో కూడా పడతాడు సుహాస్. ఈ క్రమంలో తన కళ్ల ముందే ఓ మర్డర్ జరుగుతుంది. తనకున్న ఫేస్ బ్లైండ్నెస్ సమస్యతో ఆ హమర్డర్ ఎవరు చేశారో అర్ధం కాదు సుహాస్ కు. ఐతే ఆ హత్య గురించి పోలీసులకి చెప్పేందుకు ట్రై చేస్తుంటాడు. ఇంతలో అతనిపై దాడి జరుగుతుంది. అయినప్పటికీ ఏ మాత్రం భయపడకుండా సుహాస్.. ఏసీపీ వైదేహి (రాశిసింగ్) ని కలిసి మర్డర్ గురించి చెబుతాడు. అంతే కాదు తనకున్న ఫేస్ బ్లైండ్నెస్ సమస్యనీ వివరిస్తాడు. ఐతే అనుకోని పరిస్థితుల్లో ఆ హత్య కేసులో సహాసే ఇరుక్కోవల్సి వస్తుంది. మరి ఆ మర్డర్ ఎవరు చేశారు? హత్యకి గురైన ఆ అమ్మాయి ఎవరు? ఆ మర్డర్ కేసులో సుహాస్ ను ఇరికించింది ఎవరు? ఈ క్రమంలో సుహాస్ ప్రేమ కధ ఎలాంటి మలుపులు తిరిగింది…
ప్రసన్న వదనం ఎలా ఉందంటే… Prasanna Vadanam Review
హిరో పాత్రకి ఓ మానసిక సమస్యను సృష్టించి, అందుకు కొన్ని పరిమితులు విధించి జీవన్మరణ సమస్య తరహాలో అతని చుట్టూ పలు సవాళ్లతో కథని నడిపించడం చాలా సినిమాల్లో చూసిందే. గజిని సినిమాలో సూర్య పాత్రలాగ. తనకెదురైన సవాళ్లని అధిగమిస్తూ, తాను అనుకున్న పనిని పూర్తి చేసే క్రమం ఎంత ఆసక్తికరంగా, ఎంత థ్రిల్లింగ్‌గా ప్రేక్షకులను అలరించిందన్నదే ఇక్కడ ముఖ్యం. సుహాస్ కు ఇప్పటివరకూ ఉన్న లోకల్ ఇమేజ్‌కి, ఆ తరహా కొత్త పాత్రలకి దూరంగా వెళ్లి చేసిన సినిమా ఇది. ఫేస్ బ్లైండ్ నెస్ నేపథ్యం కూడా కొత్తగా, గతంలో వచ్చిన డిజార్డర్ సినిమాలకి భిన్నంగా అనిపిస్తుంది. కధలో ఎప్పటికప్పుడు మంచి మలుపులతో ప్రేక్షకులకు థ్రిల్‌ని పంచడంలోనూ డైరెక్టర్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. హీరో సుహాస్ పాత్ర, దానికున్న సమస్య ప్రేక్షకులకు కన్ఫ్యూజన్ లేకుండా అర్థమయ్యేలా కధ చెప్పుకొచ్చాడు డైరెక్టర్. హీరో సుహాస్, అతని స్నేహితుడు వైవా హర్ష కు మధ్య వచ్చే సీన్స్, ఆద్యతో లవ్ ఎపిసోడ్ సన్నివేశాలు సరదా సరదాగా సాగిపోతాయి. హీరో సుహాస్ తన కళ్ల ముందు హత్య జరగడాన్ని చూడటం నుంచి కథలో ఆసక్తి మొదలవుతుంది. ఇంట్రవెల్ కు ముందు కథలో చోటు చేసుకునే ట్విస్ట్ సినిమాని మరింత ఇంట్రస్టింగ్ గా మార్చేస్తుంది.
ఇక సెకండ్ హాఫ్ లో హీరో సుహాస్ చుట్టూ హత్యకు సంబందించిన ఉచ్చు బిగుసుకోవడం, ఈ క్రమంలో మర్డర్ చేసిన నేరస్తుడు ఎవరనేది కనిపెట్టాలని హీరో ప్రయత్నించడం, ఈ సందర్బంగా జరిగే పరిణామాలు, హీరో సుహాస్ సాగించే పోరాటం, సదరు యువతి హత్యకు సంబంధించిన ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ సెకండ్ హాఫ్ ను ఆసక్తికరంగా మార్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. యువతిని హత్య ఎవరు చేశారనేది ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తో ప్రేక్షకుడికి తెలిసిపోయినా, తనకున్న వ్యాధి ఫేస్ బ్లైండ్ నెస్ అధిగమించి, అసలు నిజాన్ని హీరో సుహాస్ ఎలా బయట పెడతాడనేది వేరీ ఇంట్రస్టింగ్. కొన్ని చోట్ల సన్నివేశాల్లో స్పీడ్ తగ్గినట్టు అనిపించినా, ఓ సరికొత్త థ్రిల్లర్ సినిమా చూసిన అనుభూతి ప్రేక్షకులకు తప్పకుండా కలుగుతుంది.
ప్రసన్న వదనంలో ఎవరెలా చేశారు.. Prasanna Vadanam Review
ప్రసన్న వదనంలో సూర్య పాత్రలో సుహాస్ నటన అందరిని ఆకట్టుకుంటుంది. సుహాస్ పాత్ర, కథా నేపథ్యంలో సూర్యగా చూడటం ప్రేక్షకులకు కొత్తగా అనిపిస్తుంది. సూర్య పాత్ర అవసరమైన చోట వినోదాన్ని, భావోద్వేగాల్నీ పంచిందని చెప్పాలి. సుహాస్ కీ, రాశిసింగ్కీ మధ్య వచ్చే లవ్ సన్నివేశాలు సరదాగా సాగుతాయి. సుహాస్ కు ప్రియురాలిగానే కనిపించినా, కొన్ని సీన్స్ లో రాశి సింగ్ నటన ఆకట్టుకుంటుంది. ఇక పాయల్ రాధాకృష్ణ పోలీస్ అధికారి వైదేహిగా ఒదిగిపోయింది. నితిన్ ప్రసన్న పాత్ర సినిమాకి కీలకమని చెప్పకతప్పదు. మరోవైపు వైవాహర్ష హీరో ఫ్రెండ్ గా అలవాటైన పాత్రలో అలరించాడు.
ప్రసన్న వదనం బలాలు
౧-కథలో మలుపులు
౧-సుహాస్ నటన
౧-సెకండ్ హాఫ్
బలహీనతలు
౧-కాస్త సాగదిసే సన్నివేశాలు
గమనిక- ఇది కేవలం వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. (Prasanna Vadanam Review Telugu)