KCR Uttam

కేసీఆర్‌ చెప్పేవన్నీ అబద్దాలే

లోక్ సభ ఎన్నికల తరువాత బీఆర్ఎస్ పార్టీ ఉండదు-ఉత్తమ్

పొలిటికల్ రిపోర్ట్- గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ రంగాన్ని సర్వనాశనం చేశారని నీటి పారుదల, పౌరసరఫలా శాఖల మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మండిపడ్డారు. జిల్లాల పర్యటనలో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడిన ప్రతి మాటా అబద్ధమేనని ఆయన అన్నారు. బీఆర్ఎస్ సర్కార్ రైతులకు ఏనాడూ పంట బీమా ఇవ్వలేదని ఉత్తమ్ చెప్పారు. పంట బీమా లేని రాష్ట్రం దేశంలోనే తెలంగాణ ఒక్కటేనని తెలిపారు. మరోవైపు విద్యుత్‌ విషయంలో ఏదో సాధించామని కేసీఆర్  గొప్పలు చెప్పడం పచ్చి అబద్ధమని ఉత్తమ్ అన్నారు.

కేవలం కమీషన్ల కోసం ప్లాన్‌, డిజైన్లు లేకుండా ప్రాజెక్టులు నిర్మించారని ఉత్తమ్ మండిపడ్డారు. కాళేశ్వరంపై మాట్లాడేందుకు కేసీఆర్ కు సిగ్గుపడాలన్న ఉత్తమ్.. బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టు.. వారి హయాంలోనే కూలిపోయిందని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం కోసం విద్యుత్‌ ఖర్చే సంవత్సరానికి 10వేల కోట్లు అవుతోందని చెప్పారు. ఎన్టీపీసీకి సహకరించి ఉంటే 4వేల మెగావాట్ల విద్యుత్‌ ఉచితంగా వచ్చేదన్న ఉత్తమ్.. 24 గంటల విద్యుత్‌ సరఫరా చేసేందుకు ఖర్చు గురించి ఆలోచించడం లేదని, ఒక్కో ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ ఇస్తున్నామని చెప్పుకొచ్చారు.

కేసీఆర్‌ డిప్రెషన్‌, ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారన్న ఉత్తమ్.. పార్టీ మిగలదు అనే భయం ఆయనలో మొదలైందని చెప్పార్. లోక్‌సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ మిగలదని, కేసీఆర్‌ కుటుంబసభ్యులు తప్ప ఆ పార్టీలో ఎవరూ ఉండరని చెప్పారు.

 


Comment As:

Comment (0)