లోక్ సభ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన ప్రధాని మోదీ
ఢిల్లీ రిపోర్ట్- లోక్ సభ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ (BJP)పార్టీ సంకల్ప పత్రం (BJP Manifesto) పేరుతో మేనిఫెస్టోను విడుదల చేసింది. ఢిల్లీలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు అమిత్‌షా, నిర్మలా సీతారామన్, రాజ్‌నాథ్‌సింగ్ మ్యానిఫెస్టోను ఆవిష్కరించారు. మోదీ గ్యారెంటీ, 2047 నాటికి వికసిత భారత్ థీమ్‌తో బీజేపీ సంకల్ప పత్రాన్ని రూపొందించారు.
కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని మొత్తం 27 మంది సభ్యుల కమిటీ సంకల్ప పత్రాన్ని రూపొందించింది. ఆ మేనిఫెస్టో కోసం సుమారు 15 లక్షల సలహాలు సూచనలు స్పీకరించింది కమిటీ. దేశ ప్రగతి, యువత, మహిళలు, పేదలు, రైతులే అజెండాగా మెనిఫెస్టోను రూపొందించినట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి.
బీజేపీ మేనిఫెస్టోలో మొత్తం 14 అంశాలను చేర్చారు. విశ్వబంధు, సురక్షిత భారత్, సమృద్ధ భారత్, ఈజ్ ఆఫ్ లివింగ్, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, సాంస్కృతిక వికాసం, స్వస్థ భారత్, సుపరిపాలన, అత్యుత్తమ శిక్షణ, సంతులిత అభివృద్ధి, క్రీడావికాసం, సాంకేతిక వికాసం, సుస్థిర భారత్ వంటి అంశాలున్నాయి.
ఇక బీజేపీ మేనిఫెస్టోలోని ప్రధానమైన అంశాలు..
మూడు కోట్ల ఇళ్ల నిర్మాణం
70 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఆయుష్మాన్ భారత్‌లో భాగంగా 5 లక్షల వరకు ఉచిత వైద్యం
పైప్‌లైన్ ద్వారా ఇంటింటికీ వంటగ్యాస్
మరో ఐదేళ్లు ఉచిత రేషన్
దివ్యాంగుల ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా ఇళ్ల నిర్మాణం
ముద్ర రుణాల పరిమితి 20 లక్షలకు పెంపు
వృద్ధుల కోసం ఆయుష్ శిబిరాల నిర్వహణ
ట్రాన్స్‌జెండర్లకు సైతం ఆయుష్మాన్ భారత్
మూడు కోట్ల మంది మహిళలను లక్షాధికారులుగా మార్చే ప్రణాళిక
పుణ్యక్షేత్రాల పర్యటనల కోసం రాష్ట్ర ప్రభుత్వాల సాయంతో వృద్ధులకు చేయూత
డెయిరీ సహకార సంఘాల సంఖ్య పెద్ద సంఖ్యలో పెంపు
పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ద్వారా ఉచిత విద్యుత్తు
మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం
కూరగాయల సాగు, వాటి నిల్వ కోసం కొత్త క్లస్టర్లు
ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యం
మత్స్య ఉత్పత్తి, ప్రాసెసింగ్ కోసం ప్రత్యేక క్లస్టర్లు
ఎప్పటికప్పుడు పంటల మద్దతు ధర పెంపు
చిన్నరైతుల లబ్ధి కోసం శ్రీఅన్న సాగు ప్రోత్సాహం
తమిళ భాష ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయడానికి కృషి
వ్యవసాయ మౌలికవసతుల మిషన్ ప్రారంభం
ఉపాధి అవకాశాలను మెరుగుపర్చే కొత్త శాటిలైట్ పట్టణాల ఏర్పాటు
వ్యవసాయ అవసరాల నిమిత్తం ప్రత్యేక ఉపగ్రహం
దేశ ఉత్తర, దక్షిణ, తూర్పు ప్రాంతాల్లోనూ బుల్లెట్ రైలు
సేవారంగంతో స్వయం సహాయక సంఘాల అనుసంధానం
రక్షణ, వంటనూనె, ఇంధన రంగాల్లో స్వయం సమృద్ధి
ప్రపంచవ్యాప్తంగా తిరువళ్లువర్ సాంస్కృతిక కేంద్రాల ఏర్పాటు
గ్రీన్ ఎనర్జీ, ఫార్మా, సెమీ కండక్టర్, ఎలక్ట్రానిక్స్, ఇన్నోవేషన్, లీగల్ ఇన్సూరెన్స్, వాహన రంగాల్లో ప్రపంచ స్థాయి హబ్‌ల ఏర్పాటు
విమానయాన రంగానికి ఊతం
అంతరిక్ష రంగంలో భారత సామర్థ్యాన్ని పెంచేందుకు కచ్చితమైన ప్రణాళిక
విదేశాల్లోని భారతీయుల భద్రతకు హామీ
విద్యుత్తు వాహన రంగానికి ప్రోత్సాహం
ఉద్యోగ నియామకాల్లో పేపర్ లీకేజీల నివారణకు కఠిన చట్టం, పారదర్శకంగా నియామక ప్రక్రియ
వందేభారత్ విస్తరణ……………………….