akay

కోహ్లి, అనుష్క కుమారుడి పేరు అకాయ్‌ కి అర్థమేంటో తెలుసా?

క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ (Virat Kohli), అనుష్క శర్మ (Anushka Sharma) మరోసారి తల్లిదండ్రులు అయ్యారు. ఈ నెల 15న అనుష్క మగబిడ్డకు జన్మనిచ్చిందని విరాట్ కోహ్లి మంగళవారం సోషల్ మీడియా ద్వార తెలిపాడు. తమ బిడ్డకు అకాయ్‌ (Akaay) అని పేరు పెట్టినట్లు కోహ్లీ తెలిపాడు. దీంతో ఈ పేరుకు అర్థం ఏంటని సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. సంస్కృతంలో అకాయ్ పదానికి అమరుడు, చిరంజీవుడు అనే అర్థం వస్తుందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు హిందీలో కాయ్‌ అంటే శరీరమని, అకాయ్‌ అంటే భౌతిక శరీరానికి మించినవాడు అని అర్ధం వస్తుందట.

ఇక టర్కీ భాషలో ఈ పదానికి ప్రకాశిస్తున్న చంద్రుడు అనే అర్థం కూడా ఉందట. మరి విరుష్క జంట ఏ అర్థంలో తమ బిడ్డకు అకాయ్‌ అని పేరు పెట్టారో తెలియదు కాని అభిమానులు మాత్రం తమకు నచ్చిన అర్ధాన్ని వెతుక్కుంటున్నారు. అన్నట్లు విరాట్ కోహ్లీ, అనుష్క దంపతులకు ఇప్పటికే మూడేళ్ల కుమార్తె వామిక ఉంది. ఇప్పుడు మగపిల్లాడు జన్మించడంతో వారికి సినీ-రాజకీయ-క్రీడా రంగ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.


Comment As:

Comment (0)