ఉదయం టిఫిన్ లో అరటిపండు తినకూడదా?
స్పెషల్ రిపోర్ట్- ప్రతి రోజూ ఉదయం అల్పాహారం తప్పకుండా తీసుకోవాలని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. చాలా మంది ఖాళీ కడుపుతోనే బ్రేక్‌ఫాస్ట్‌ని స్కిప్ చేస్తుంటారు. ఇలా చాలా కాలం అల్పాహారం తీసుకోకపోవజం వల్ల గ్యాస్ట్రిక్తో పాటు అనేక అనారోగ్య సమస్యలను ఎదురవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొందరు బరువు తగ్గాలనే ఉద్దేశంతో ఉదయం బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం మానేస్తున్నారు. ఐతే ఇది ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని వైద్యులు అంటున్నారు. ప్రతిరోజూ తప్పనిసరిగా అల్పాహారం తీసుకోవాలని, అది కూడా మంచి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఐతే అల్పాహారంలో అరటి పండు తీసుకుంటారు చాలా మంది. నిజానికి అరటిపండ్లలో పోషక విలువలు ఎంత ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐతే అరటి పండులో సుమారు 25 శాతం చక్కెర ఉంటుంది. చాలా మంది బ్రేక్ ఫాస్ట్ గా అరటిపండును తీసుకుంటుంటారు. వీటిని తినడం వల్ల తాత్కాలికంగా బలంగా అనిపించినా కాసేపటికే అలసటగా, ఆకలిగా అనిపించేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అరటిపండులోని చక్కెర బూస్ట్ కోరికలను ప్రేరేపిస్తుంది. అందుకే అల్పాహారంలో అరటి పండ్లు తినకూడదని వైద్యులు సూచిస్తున్నారు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో అరటి పండ్లను తీసుకోకుండా సాయంత్రం స్నాక్స్ గా వీటిని తింటే ఆరోగ్యకరమైన కొవ్వులు లభిస్తాయిని వైద్య నిపుణులు చెబుతున్నారు.