ఎన్నికల ప్రచారం నిర్వహించిన నటుడు వెంకటేశ్‌ కుమార్తె

ఎన్నికల ప్రచారం నిర్వహించిన నటుడు వెంకటేశ్‌ కుమార్తె

ఖమ్మం రిపోర్ట్- టాలీవుడ్ నటుడు విక్టరీ వెంకటేశ్‌ (Daggubati Venkatesh) కూతురు లోక్ సభ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంది. అవును వెంకటేశ్ కూతురు ఆశ్రిత (Daggubati Ashritha) బుధవారం ఖమ్మంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూతురు స్వప్నిరెడ్డి తో కలిసి ఖమ్మం సిటీలో ఇంటింటి ప్రచారం చేశారు. లోక్‌ సభ ఎన్నికల్లో ఖమ్మం నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేస్తున్న అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి స్వప్నిక మామ. అందుకే ఆయనకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంది. ఆయనను గెలిపించాలని ఖమ్మం ప్రజలను కోరార ఆశ్రిత. ఖమ్మంలోని పోలీసు హౌసింగ్‌ కాలనీలో జరిగిన ఆత్మీయ సమావేశానికి హాజరైన ఆశ్రిత ఓట్లు అభ్యర్థించారు. ఈ ఎన్నికల ప్రచారంలో రఘురాంరెడ్డి చిన్న కుమారుడు అర్జున్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.