సినిమాలపై క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్

అప్పుడే షూటింగ్స్ లో పాల్గొంటానన్న పవన్

సినిమాలపై క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్

పిఠాపురం రిపోర్ట్- ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్.. ఇకపై సినిమాల్లో నటిస్తారా.. లేదా అన్న ప్రశ్న అందరిలో మెదులుతుంది. మరీ ముఖ్యంగా ఆయన అభిమానుల్లో ఈ సందేహం కాలా రోజులుగా కలుగుతోంది. ఇటువంటి సమయంలో సినిమాల్లో నటించే అంశంపై ఎట్టకేలకు స్పందించారు పవన్ కళ్యాణ్. దీనిపై అభిమానులకు క్లారిటీ ఇచ్చారు. 

తాను ప్రజా సేవలో బిజీగా ఉన్న నేపధ్యంలో సినిమాలపై పెద్దగా ఆలోచించడం లేదని చెప్పారు పవన్ కళ్యాణ్. ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు సేవ చేయకుండా ఓజీ చేస్తా మీరు క్యాజీ అంటారుగా అని తనదైన స్టైల్లో పిఠాపురం ప్రజలను ఉద్దేశించి అన్నారు పవన్. రెగ్యులర్ గా సినిమాలు చేయనందుకు ఇప్పటికే తన నిర్మాతలకు క్షమాపణలు చెప్పానన్న పవన్.. మూడు నెలల తరువాత సమయం దొరికినప్పుడల్లా ఒకట్రెండు రోజులు షూటింగ్స్ లో పాల్గొంటానని ప్రకటించారు.

దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఓజీతో పాటు, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు సినిమాలు చేస్తున్నారు పవన్. ఓజీ షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. మిగిలిన ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు షూటింగ్ కు చాలా సమయమే పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే OG సినిమా తరువాత, పవన్ కళ్యాణ్ సినిమాలకు బ్రేక్ పడ్డట్టేనని ప్రచారం జరుగుతోంది.