బాలీవుడ్ నిర్మాతను పెళ్లి చేసుకోబోతున్న రకుల్
పెళ్లిపీటలెక్కబోతున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్
మూవీ రిపోర్ట్- టాలీవుడ్ లో మరో హీరోయిన్ పెళ్లి పీఠలెక్కబోతోంది. అందాల నటి రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh), బాలీవుడ్ ప్రొడ్యూసర్ జాకీ భగ్నానీ (Jackky Bhagnani) చాలా కాలం నుంచి ప్రేమలో ఉన్నా సంగతి అందరికి తెలిసిందే. వీరిద్దరి పెళ్లి గురించి ఇప్పటికే చాలా సందర్బాల్లో చర్చ జరిగింది. ఐతే సరైన టైం వచ్చినప్పుడు తప్పకుండా పెళ్లి చేసుకుంటామని గతంలో రకుల్ ప్రీత్ సింగ్ చెప్పారు. ఇదిగో ఈ క్రమంలోనే ఈ ఏడాది ఫిబ్రవరి 22న గోవాలోని ఓ ప్రముఖ రిసార్ట్‌లో వీరిద్దరి వివాహం జరగనుందని బాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. ఇరువురి కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో రకుల్, జాకీ భగ్నాని పెళ్లి జరగనుందని తెలుస్తోంది. ఆ తర్వాత సినీ ప్రముఖుల కోసం ప్రత్యేకంగా విందు ఇవ్వనున్నారని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అన్నట్లు రకుల్ ప్రీత్ సింగ్ గిల్లి అనే కన్నడ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఐతే 2013లో విడుదలైన తెలుగు సినిమా వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ తో మొదటి సక్సెస్ అయ్యింది. ప్రస్తుతం ఆమె తెలుగుతో పాటు బాలీవుడ్‌లోనూ పలు సినిమాల్లో నటిస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్ నటించిన తాజా సినిమా అయాలన్ సంక్రాంతి పండగకు విడుదల అవుతోంది.