నేను మీకు ఆంటీని కాదు – అనసూయ భరద్వాజ్

ప్రతిసారి నన్నెందుకు లాగుతారు..

నేను మీకు ఆంటీని కాదు – అనసూయ భరద్వాజ్

సినిమా రిపోర్ట్- టీవీ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) తన సినిమాలతో పాటు, కుటుంబానికి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వార అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో తన పేరును ప్రస్తావిస్తూ కామెంట్స్‌ చేసే నెటిజన్లకు తనదైన శైలిలో సమాధానం చెబుతుంటారు అనసూయ. ఇటీవల విజయ్‌ దేవరకొండను కోట్‌ చేస్తూ కార్తీక్ అనే నెటిజన్‌ చేసిన కామెంట్‌లో అనసూయ పేరును ప్రస్తావించాడు. సదరు నెటిజన్ వ్యాఖ్యపై అనసూయ భరద్వాజ్ తీవ్ర అసహనం వ్యక్తం చేయడం ఆసక్తికరంగా మారింది.

తనపై కామెంట్ చేసిన కార్తీక్ ను ఉద్దేశిస్తూ అనసూయ ఏమన్నారంటే.. ఎందుకు కార్తీక్‌ గారు అస్తమానం నన్ను లాగుతుంటారు.. ఎవరు ఏం మాఫియా చేస్తున్నారో నేను ఎప్పుడో చెప్పి వదిలేశాను.. అనవసరంగా నేనే హైప్‌ ఇస్తున్నానని, నిజమేనేమోనని వదిలేశాను.. నేను కూడా తెలంగాణ బిడ్డనే.. కానీ నాకు సింపథీ అవసరం లేదు.. నాకు నా మీద, దేవుడి మీద నమ్మకం, మా తల్లిదండ్రులు నాకిచ్చిన విలువలు.. వారి పెంపకం.. నన్ను నా దృష్టిలో ఎప్పుడూ దిగజారనివ్వవు.. ఇప్పుడు ట్వీట్‌ని కూడా తమ స్వార్థానికి వాడుకున్నా నేనేమీ ఆశ్చర్యపోను.

ఇంకా అనసూయ ఏమన్నారంటే… కానీ నాకు వాళ్లకూ ఎటువంటి సంబంధం లేదు. అన్నట్లు నాకు తెలిసి మీరు, నేనూ రిలెటివ్స్ ము అస్సలు కాదు. నేను మీకు ఆంటీ కానేమో. అయినా మీ ఇంట్లో ఒకసారి అడగండి. మీకు తెలియకుండా రిలేషన్స్‌ ఉన్నాయేమో. ఎందుకంటే చుట్టాలైతేనే పలకరింపులు ఉంటాయని నాకు నా పెద్ద వాళ్లు నేర్పించారు. ఏదేమైనా మీకు అంతా మంచి జరగాలి.. అంటూ సదరు నెటిజన్ కు సమాధఆనం ఇచ్చారు అనసూయ భరద్వాజ్. ఇక అనసూయ సినిమాలకు వస్తే.. మొన్న విడుదలైన రజకార్‌ సినిమాలో పోచమ్మగా నటించి మెప్పించారు. మరోవైపు అల్లు అర్జున్ పుష్ప2 లో (Pushpa 2: The Rule) దాక్షాయణిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. మరికొన్ని సినిమాల్లో ఇంట్రస్టింగ్ క్యారెక్టర్స్ చేస్తున్నారు అనసూయ భరద్వాజ్.