అనసూయ. ట్వీట్.. నా పేరు లేకుండా పాపం ఏదీ చెప్పలేకపోతున్నారు

అనసూయ. ట్వీట్.. నా పేరు లేకుండా పాపం ఏదీ చెప్పలేకపోతున్నారు

స్పెషల్ రిపోర్ట్- అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) .. ఒకప్పుడు జబర్దస్త్ షో ద్వార ఫేమస్ అయిన ఈమె ఇప్పుడు సినిమాల్లో బిజీగా ఉంది. అనసూయ ఎప్పుడూ సోషల్ మీడియాలో బిజీగా ఉండటమే కాదు.. వివాదాలు కూడా ఎక్కువే. ఇదిగో తాజాగా.. నా పేరు లేకుండా పాపం ఏదీ చెప్పలేకపోతున్నారు.. అంటూ అనసూయ  చేసిన ట్వీట్‌ వైరల్ అవుతోంది. ఇంతకీ ఎవరిని ఉద్దేశించి అనసూయ ఈ వాఖ్యాలు చేసిందో క్లియర్ గా చెప్పకపోవడంతో సోషల్ మీడియాలో ఎక్కొరు ఒక్కోలా కామెంట్స్ చేస్తున్నారు.

ఇంతకీ అనసూయ ట్వీట్ లో ఏమందంటే.. వావ్‌, నేను నిజంగా చాలా చాలా ముఖ్యమైనదాన్ని.. నా ప్రమేయం ఉన్నా లేకున్నా, నాకు సంబంధం ఉన్నా లేకున్నా.. నా పేరు ఎత్తకుండా ఒక్క డిస్కషన్‌ కూడా జరగదంటే.. నాపై అంత డిపెండ్‌ అయి ఉన్నారు. నా పేరు లేకుండా పాపం ఏదీ చెప్పలేకపోతున్నారు.. అని పోస్ట్ చేసింది. 

అనసూయ ట్వీట్ పై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. మిమ్మల్ని ఎవరు ఏమన్నారు అని ఒకరు అడిగితే, మళ్లీ ఏమైంది మేడమ్‌.. అని మరొకరు ప్రశ్నించారు. గతంలోను పలు సందర్భాల్లో అనసూయ పరోక్షంగా పెట్టిన ట్వీట్‌ లు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇటీవల ఓ హీరో కొత్త సినిమా పోస్టర్‌ విడుదల కాగా దానిపై అభిప్రాయం వ్యక్తం చేసిన అనసూయకు సదరు కథానాయకుడి ఫ్యాన్స్‌ నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదురయ్యాయి.