ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 82.37 శాతం పోలింగ్
అమరావతి రిపోర్ట్- ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల పోలింగ్ (AP Elections 2024) ముగిసింది. 13 వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు క్యూలైన్లలో ఓటర్లు బారులు తీరడంతో అర్ధరాత్రి 12 దాటినా కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ జరిగింది. ఎన్నికల కమిషన్ అంచనాల ప్రకారం అర్ధరాత్రి 12 గంటల సమయానికి సుమారు 82.37 శాతం పోలింగ్ నమోదైంది. ఆంధ్రప్రదేశ్ లో అత్యధికంగా కోనసిమ జిల్లాలో 83.19 శాతం పోలింగ్ నమోదవ్వగా, అల్లూరి సీతామారాజు జిల్లాలో అతి తక్కువగా 63.19 పోలింగ్ శాతం నమోదైంది. తుది పోలింగ్ శాతాన్ని ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.