వరంగల్‌ ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన బీఆర్ఎస్

వరంగల్‌ ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన బీఆర్ఎస్

హైదరాబాద్ రిపోర్ట్- బీఆర్ఎస్ (BRS) పార్టీ వరంగల్‌ ఎంపీ అభ్యర్థి ఎట్ట్కేలకు ప్రకటించింది. మారేపల్లి సుధీర్‌ కుమార్‌ను (Marepalli Sudhir Kumar) వరంగలల్ ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేసినట్టు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ (KCR) స్పష్టం చేశారు. సుధీర్‌ కుమార్‌ ప్రస్తుతం హనుమకొండ జడ్పీ ఛైర్మన్‌ గా ఉన్నారుశుక్రవారం ఉదయం ఎర్రవల్లి ఫామ్ హౌజ్ లో పార్టీ ముఖ్యనేతలతో నేతలతో చర్చించిన తరువాత మేరకు నిర్ణయం తీసుకున్నట్టు బీఆర్ఎస్ నేతలు తెలిపారు. తెలంగాణ ఉద్యమకారుడిగా, టీఆర్ఎస్ పార్టీకి విధేయుడిగా, అధినేత కేసీఆర్ తో కలిసి పనిచేస్తున్న సుధీర్ కుమార్ సరైన అభ్యర్థి అని ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ ముఖ్యనేతలు అన్నారు.