ఆనంద్, విరాజ్‌లలో ఎవరిని పెళ్లి చేసుకుంటావ్? వైష్ణవి బేబీ ఎంచెప్పిందంటే..
వైష్ణవి చైతన్య స్పెషల్ వీడియో
మూవీ రిపోర్ట్- వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya).. తెలుగు ప్రేక్షకులకు ఇప్పుడు ఈ పేరును పరిచయం చేయక్కర్లేదు. బేబీ ((Baby)) సినిమాతో వైష్ణవి ఒక్కసారిగా స్టార్ అయిపోయింది. ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda), విరాజ్ అశ్విన్ (Viraj Ashwin), వైష్ణవి చైతన్య కీలక పాత్రల్లో నటించిన రొమాంటిక్ అండ్ సెంటిమెంట్ డ్రామా బేబీ. జులై 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వియజాన్ని అందుకుంది. థియేట్రికల్ రన్ లో ఏకంగా 90 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి తన సత్తా చాటింది బేబీ. ప్రస్తుతం తెలుగు ఓటీటీ వేదిక ఆహా (Aha) లో స్ట్రీమింగ్ అవుతోంది బేబీ. ఆహా లోను కూడా ఎక్కువ మంది చూసిన సినిమాగా బేబీ రికార్డు సృష్టించింది.
ఈ సందర్బంగా ఆహా ఓటీటీ వాట్సాప్ బేబీ పేరుతో వైష్ణవి చైతన్య వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ క్రమంలో అడిగిన పలు ప్రశ్నలకు వైష్ణవి చైతన్య తనదైన స్టైల్లో సమాధానం చెప్పింది. అందులో ప్రధానంగా ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ లలో ఒకరిని పెళ్లి చేసుకోవాలనుకుంటే ఎవరిని చేసుకుంటావ్.. అని అడగ్గా, ఇద్దరినీ కాదు.. అని ఠక్కున సమాధానం చెప్పింది వైష్ణవి చైతన్య. ఐతే ఒక్కొక్కరిలో ఒక్కో క్వాలిటీ తనకు నచ్చుతుందని చెప్పింది. ఇక బేబీ సినిమాలో మీకు వైష్ణవి క్యారెక్టర్ నచ్చిందా అని అడగ్గా, ఎంతో నచ్చిందని చిరునవ్వుతో సమాధానం చెప్పింది వైష్ణవి. ఇంతకీ వైష్ణవి ఎంత క్యూట్ గా ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పిందో మీరు చూసేయండి.
<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">This baby is killi'n it in reel and real!
