అమితాబ్‌ బచ్చన్ కు రాఖీ కట్టిన సీఎం మమత బెనర్జీ

బాలీవుడ్‌ స్టార్‌ హీరో అమితాబ్‌ ఇంటికి వెళ్లిన దీదీ 

అమితాబ్‌ బచ్చన్ కు రాఖీ కట్టిన సీఎం మమత బెనర్జీ

స్పెషల్ రిపోర్ట్- పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ (Amitab Bachan) కు రాఖీ కట్టారు. మమతా బెనర్జీ ఆగస్టు 31, సెప్టెంబర్‌ 1 తేదీల్లో జరగనున్న విపక్ష కూటమి ఇండియా (I.N.D.I.A) కీలక సమావేశంలో పాల్గొనేందుకు బుధవారం ముంబయికి వచ్చారు. ఈ  సందర్బంగా అమితాబ్‌ బచ్చన్‌ ను ఆయన నివాసానికి వెళ్లి కలిశారు. రక్షాబంధన్‌ పండగ వేళ అమితాబ్‌కు రాఖీ కట్టారు దీదీ. ముంబయి పర్యటన నేపథ్యంలో మమతా బెనర్జీని అమితాబ్‌ తేనీటి విందుకు ఆహ్వానించినట్టు తెలుస్తోంది.

అమితాబ్‌ బచ్చన్ కుటుంబ సభ్యులతో చాలా సమయం గడిపిన మమతా.. పలు అంశాలను మీడియాతో పంచుకున్నారు. అమితాబ్‌ బచ్చన్ ఇంటికి రావడం తనకు చాలా ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి మమత బెనర్జీ చెప్పారు. ఆయను రాఖీ కట్టినట్టు చెప్పారు. అమితాబ్‌ ఫ్యామిలీ అంటే తనకు చాలా ఇష్టమన్న మమతా, ఆ కుటుంబం దేశానికి ఎంతో సేవ చేసిందని, దేశంలోనే నంబర్‌ వన్‌ అని అన్నారు. బెంగాల్‌ లో జరిగే దుర్గా పూజతో పాటు అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి అమితాబ్ బచ్చన్ కుటుంబాన్ని ఆహ్వానించినట్టు దీదీ చెప్పారు.