జానపద గాయని ఊర్వశిపై కరెన్సీ నోట్ల వర్షం

ఆమె పాడుతున్నంతసేపు కరెన్సీ నోట్ల వర్షమే..

జానపద గాయని ఊర్వశిపై కరెన్సీ నోట్ల వర్షం

స్పెషల్ రిపోర్ట్- ఓ గాయనికి ఎదురైన అనూహ్య ఘటన అమె ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. గుజరాత్‌ (Gujarat) కు చెందిన ఓ జానపద గాయనిపై కరెన్సీ నోట్ల (Currency Notes) వర్షం కురిసింది. ఓ ప్రత్యేక కార్యక్రమం సందర్బంగా ఆమె తన టీంతో కలిసి ఓ జానపద పాట పాడుతున్నంతసేపూ అభిమానులు ఆమెపై కరెన్సీ నోట్లను వెదజల్లుతూనే ఉన్నారు. దీంతో స్టేజ్ అంతా కరెన్సీ నోట్లతో నిండిపోయింది.

గుజరాత్ లోని కచ్‌ (Kutch) లో గోశాల పనుల కోసం నిధుల సేకరణలో భాగంగా ఏర్పాటు చేసిన సంగీత కచేరీలో జానపద గాయని ఊర్వశీ రాధాదియా (Uravashi Radadiya) పాటలు పాడారు. గురువారం జరిగిన ఈ సంగీత కచేరిలో ఊర్వశీ తన జానపద పాటలతో ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించారు. ఆమె పాటలు పాడుతున్నంతసేపు అభిమానులు, ప్రేక్షకులు ఆమెపై కరెన్సీ నోట్లు వెదజల్లారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను సింగర్ ఊర్వశీ రాదాదియా తన ట్విటర్‌ అకౌంట్ లో పోస్ట్ చేయగా వైరల్ గా మారింది. మీరూ ఈ విడీయో చేసేయండి.

<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr"><a href="https://twitter.com/hashtag/WATCH?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#WATCH</a> | Gujarat: People showered notes worth lakhs of rupees during folk singer Urvashi Radadiya&#39;s performance in Kutch. The money collected during this event will be used for the work of Gaushala <a href="https://t.co/w0QN4WTh7L">pic.twitter.com/w0QN4WTh7L</a></p>&mdash; ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1702654868471820376?ref_src=twsrc%5Etfw">September 15, 2023</a></blockquote> <script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>