విద్యార్దినుల వాష్ రూంలో రహస్య వీడియో చిత్రీకరణ
ఐఐటీ-దిల్లీ ఫెస్ట్ లో కలకలం
నేషనల్ రిపోర్ట్- దిల్లీ-ఐఐటీలో (IIT Delhi) శుక్రవారం నిర్వహించిన ఫెస్ట్‌లో భాగంగా ఏర్పాటు చేసిన ఫ్యాషన్ షో కోసం దుస్తులు మార్చుకునేందుకు విద్యార్థినులు ఉపయోగించిన వాష్ రూంలో రహస్య వీడియో చిత్రీకరణ ఘటన కలకలం రేపుతోంది. దిల్లీ యూనివర్సిటీకి (Delhi University) చెందిన భారతీ కళాశాల విద్యార్థినులు ఈ మేరకు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు. ఈ దారుణ సంఘటనపై భారతీ కళాశాల విద్యార్థినులు సోషల్ మిడీలో ఓ వీడియో సైతం పోస్ట్ చేశారు.
వీడియో చిత్రీకరణ గురించి తాము ఐఐటీ-దిల్లీ యాజమాన్యానికి సమాచారం ఇచ్చినా బాధ్యుడిపై చర్యలు తీసుకోలేదని విద్యార్ధినులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు స్థానిక కిషన్ గఢ్ పోలీస్‌స్టేషనులో కేసు నమోదు కాగా, ఇప్పటిటే ఓ కాంట్రాక్టు స్వీపర్ (20) ను అరెస్టు చేసి జుడీషియల్ కస్టడీకి తరలించినట్లు పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై సీరియస్ గా విచారణ జరుపుతున్నట్లు కిషన్ గఢ్ పోలీసులు తెలిపారు.
