24 గంటల సమయం ఇస్తున్నా.. బీజేపీ ఎంపీ అర్వింద్ కు ఎమ్మెల్సీ కవిత సవాల్

24 గంటల సమయం ఇస్తున్నా.. బీజేపీ ఎంపీ అర్వింద్ కు ఎమ్మెల్సీ కవిత సవాల్

పొలిటికల్ రిపోర్ట్- తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) కూతురు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ (Dharmapuri Arvind) పై ఫైర్ అయ్యారు. ధర్మపురి అర్వింద్‌ కు 24 గంటల సమయం ఇస్తున్నానని, తనపై చేసిన అవినీతి ఆరోపణలను నిరూపించాలని కవిత సవాల్‌ విసిరారు. తనపై చేసిన ఆరోపణలు నిరూపించకపోతే ఆయన ముక్కు నేలకు రాయాలని డిమాండ్‌ చేశారు కవిత. 

తాను ఎంపీగా ఉన్నప్పుడు రెండు కేంద్రీయ విద్యాలయాలు తెచ్చానని చెప్పిన కవిత, ఆ సమయంలోనే స్పైస్‌ బోర్డు తెచ్చినా, దాన్ని అర్వింద్‌ తెచ్చానని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కవిత. ఇప్పుడు అర్వింద్ తన భర్తపై ఆరోపణలు చేస్తున్నారని, ఆయన పేరు తీసుకురావాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. తాను, నాన్న, అన్న రాజకీయాల్లో ఉన్నాం అని సహించామని.. కానీ తన భర్త పేరు వాడటం సరైన పద్ధతి కాదని హెచ్చరించారు కల్వకుంట్ల కవిత. మరి కవిత సవాల్ కు అర్వింద్ ఎలా స్పందిస్తారన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తిరేపుతోంది.