అధికారికంగా కోర్టు నుంచి విడాకులు తీసుకున్న నిహారిక - చైతన్య

అధికారికంగా కోర్టు నుంచి విడాకులు తీసుకున్న నిహారిక - చైతన్య

ఫిల్మ్ డెస్క్- మెగా బ్రదర్ నాగబాబు గారాల కూతురు, నటి నిహారిక కొణిదెల (Niharika Konidela), ఆమె భర్త చైతన్య జొన్నలగడ్డ (Chaitanya Jonnalagadda) అధికారికంగా విడిపోయారు. వీరిద్దరు తమ వైవాహిక బంధానికి స్వస్తి పలికారు. ఈ మేరకు నిహారిక, చైతన్య కోర్టు ద్వార విడాకులకు (Niharika Chaitanya gets Divorced) తీసుకున్నారు. ఇరువురి ఇష్టప్రకారమే హైదరాబాద్‌లోని కూకట్‌ పల్లి ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకోగా, కోర్టు విడాకులను మంజూరు చేసింది. 

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తమ్ముడు, నటుడు, నిర్మాత నాగబాబు (Nagababu) కూతురు నిహారిక, గుంటూరు ఐజీ ప్రభాకర్‌ రావు కుమారుడు చైతన్య జొన్నలగడ్డకు 2020 ఆగస్టులో నిశ్చితార్థం జరిగింది. 2020 డిసెంబరులో రాజస్థాన్‌ ఉదయపూర్‌ లో ఉన్న ఉదయ్ విలాస్‌ లో వారి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి తరువాత సినిమాలకు దూరమైన నిహారిక  డెడ్‌ పిక్సెల్స్‌  (Dead Pixels) వెబ్‌ సిరీస్‌ తో ఇటీవలే మళ్లీ తెరంగేట్రం చేసింది.

నిహారిక, చైతన్య ల మధ్య మనస్పర్థలు తలెత్తాయని, విడిపోయేందుకు సిద్ధపడ్డారని గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. వీరిద్దరు తాము కలిసి దిగిన ఫొటోలను సోషల్‌ మీడియా అకౌంట్స్ నుంచి తొలగించడంతో ఈ ప్రచారం మరింత పెరిగింది. ఇక మెగా కుటుంబంలో జరిగిన వేడుకలన్నింటికీ నిహారిక మాత్రమే హాజరుకావడం చర్చకు దారి తీసింది. మొత్తానికి ఈ ప్రచారానికి తెర దించుతూ నిహారిక, చైతన్యలు విచాకులతో అధికారికంగా విడిపోయారు.